జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు బలంగా మారింది ఈ ఓటర్లేనా..!
తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ కుమార్ యాదవ్ ఆధిక్యంలో దూసుకుపోతుండగా.. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మాత్రం పూర్తిగా వెనుకంజలో ఉంది. కౌంటింగ్ ప్రారంభం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే నవీన్ కుమార్ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక ఇక పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు పూర్తైన తరుణంలో అధికారులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) లెక్కింపును ప్రారంభించారు.
ఇప్పటికే ఏడు రౌండ్లు కౌంటింగ్ పూర్తి అవ్వగా ప్రధాన అభ్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నడుస్తోంది. ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ మెజారిటీ మొత్తం 19,619 వేలు దాటడం గమనార్హం. దీంతో గాంధీభవన్‌లో సంబరాలు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున గాంధీభవన్ చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. అలానే సీఎం రేవంత్ రెడ్డి నివాసంతో పాటు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం వద్ద పార్టీ శ్రేణులు సెలబ్రేషన్స్ షురూ చేశారు.

అయితే ఎన్నికల సంఘం జాబితా ప్రకారం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు నియోజవర్గ పరిధిలో ఉన్నారు. వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నారు. కాగా ఉప ఎన్నికలో పోలింగ్ 48.49 శాతంగా తేలింది. 34 కేంద్రాల్లో మాత్రం 60 శాతానికి పైగా నమోదయ్యింది. 192 కేంద్రాల్లో 50 శాతం మందికి పైగా ఓటేయగా.. అత్యల్పంగా పోలింగ్ నమోదైన కేంద్రాలు షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్ డివిజన్లు ఉన్నాయి.
కాంగ్రెస్‌కు బలంగా మారింది ఈ ఓటర్లే..!
ఇక ఈ ఉప ఎన్నికల్లో 30 నుంచి 39 ఏళ్ల వయసు గల ఓటర్ల పాత్ర నిర్ణయాత్మకంగా మారిందని తెలుస్తోంది. దాదాపు 97,000 మంది ఈ వయస్సు గలవారు ఉన్నారు. అంటే నియోజకవర్గం లోని ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు ఈ వయస్సుకు చెందినవారే. అలానే 40-49 సంవత్సరాల వయస్సు గలవారు 87,492 మంది ఉండగా.. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య దాదాపు 21.9 శాతంగా ఉంది. వీరితో పాటు 20-29 సంవత్సరాల వయస్సు గల యువ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే.. 72,000 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 50-59 సంవత్సరాల వయస్సు గల 67,703 మంది ఓటర్లు.. 60 నుంచి 79 సంవత్సరాల వయస్సు గల 56,000 మంది ఉన్నారు.

ఇక మొదటిసారి ఓటు వినియోగించుకునే 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గలవారు కేవలం 3 శాతం మాత్రమే ఓటర్లు ఉన్నారు. దీని బట్టి చూస్తే ఉపఎన్నికను 30 నుంచి 39 ఏళ్ల వయస్సు గల ఓటర్లు కచ్చితంగా ప్రభావితం చేసినట్టు కనబడుతోంది. వీరంతా యువకుడైన నవీన్ కుమార్ యాదవ్ కు ఒక ఛాన్స్ ఇద్దామనే యోచన.. అధికార కాంగ్రెస్ పార్టీ విషయాన్ని పరిగణలోకి తీసుకొని హస్తం వైపు మొగ్గు చూపినట్టు భావిస్తున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications