నదీ విహారం చేయాలనుందా.. సోమశిల నుండి శ్రీశైలానికి.. రెడీ అయిపోండి!
తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి అందాలను, కృష్ణమ్మ సోయగాలను ఆస్వాదించాలి అనుకునే పర్యాటకులకు శుభవార్త. ఈనెల సెప్టెంబర్ 15వ తేదీ నుండి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లోని సోమశిల నుండి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో పర్యాటక లాంచీ ప్రయాణాలు మొదలు కాబోతున్నాయి. గతంలో భారీ వరదల కారణంగా నిలిచిపోయిన ఈ సేవలు మళ్లీ పునః ప్రారంభం కావడం లాంచీలో ప్రయాణం చేయాలని భావించే వారికి శుభవార్త.
సోమశిల నుండి శ్రీశైలం పర్యాటక లాంచి
ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సోమశిల నుండి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో పర్యాటక లాంచీ ప్రారంభం అవుతుంది. అయితే ప్రయాణికుల బుకింగ్స్ ను బట్టి ఈ సెప్టెంబర్ 15న గానీ, 16న గానీ లాంచీ ప్రయాణాలు ప్రారంభం అవుతాయి. ఈ లాంచీ సోమశిల నుండి శ్రీశైలానికి, శ్రీశైలం నుంచి సోమశిలకు, ప్రయాణికుల సామర్థ్యాన్ని బట్టి నడుస్తుంది.

లాంచీలో ప్రయాణానికి ధరలు ఇలా
ఈ డబల్ డెక్కర్ ఏసీ లాంచ్ ని 120 మంది కూర్చుని ప్రయాణం చేసే సామర్థ్యంతో రూపొందించారు. ఇక ఈ లాంచీలో ప్రయాణం చేయాలంటే పెద్దలకు టికెట్ ధర 2000 రూపాయలు కాగా, చిన్న పిల్లలకు 1600 రూపాయలుగా నిర్ణయించారు. ఉదయం 9 గంటలకు సోమశిల నుండి శ్రీశైలానికి ఈ లాంచీ బయలుదేరుతుంది.
పర్యాటకులకు భోజన సదుపాయంతో లాంచీ
కృష్ణా నదిలో ప్రయాణం చేస్తూ వారు ఏడు గంటల ప్రయాణం తర్వాత పాతాళగంగ ఏరియాలోని ఈగలపెంట బోటింగ్ పాయింట్ కు ఈ లాంచీలో చేరుకుంటారు. ఈ ప్రయాణం సందర్భంగా పర్యాటకులకు భోజనంతోపాటు టీ, బిస్కెట్లు వంటివి కూడా లాంచీలో ఇస్తారు. ఇక పాతాళగంగ బోటింగ్ పాయింట్ నుండి శ్రీశైలం ఆలయానికి పర్యాటకులు వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ లాంచీలో ప్రయాణం పర్యాటకులకు మంచి అనుభూతిని మిగులుస్తుంది.
సుందర ప్రకృతి దృశ్యాలు చూస్తూ.. కృష్ణా నదిలో ప్రయాణం
కృష్ణా నదిలో సుందర ప్రకృతి దృశ్యాలను చూస్తూ ప్రయాణం చేయడం ప్రయాణికులకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. దసరా పండుగ సందర్భంగా ఈ లాంచి ని మళ్లీ తిరిగి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. భక్తులు, పర్యాటకులు ఈ లాంచి సేవలను తిరిగి వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. ఈ లాంచీ సేవలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
లాంచీలో కృష్ణానదిలో ప్రయాణం మంచి అనుభూతి
ఇటీవల కురిసిన వర్షాలకు మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. కృష్ణమ్మ పరవళ్ళతో అందంగా కనిపిస్తున్న శ్రీశైలం ఇప్పుడు ప్రతి ఒక్కరిని రారమ్మని ఆహ్వానిస్తోంది. అందులో లాంచీలో కృష్ణా నదిలో ప్రయాణం మంచి అనుభూతిని ఇస్తుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications