దారుణం: యువతిని ఆటోలో ఎక్కించి యాసిడ్ దాడి, కాళ్లూ చేతులు కట్టేసి...
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై కొందరు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలిని మట్టెవాడకు చెందిన మాధురిగా గుర్తించారు. ఆమెను కొంతమంది దుండగులు ఆటో ఎక్కించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె కాళ్లూ చేతులు కట్టేసి సమీపంలోని పొదల్లో పడవేసి పరారయ్యారు.

ఐనవోలు దగ్గర అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతిని స్థానికులుని గుర్తించారు. యాసిడ్ దాడికి గురైనట్లు తెలిసి చికిత్స నిమిత్తం వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్లపై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మాధురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications