వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'కారు జఫ్తు'పై షాక్, కలెక్టర్ ఆమ్రపాలి స్పందన, వారిపై అసహనం!: అసలేం జరిగింది?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కలెక్టర్ ఆమ్రపాలిపై కోర్టు ఆగ్రహం..!

వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా ఐసీడీఎస్ హాస్టల్ అద్దె చెల్లించకపోవడంతో కలెక్టర్ వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని వరంగల్ రెండో అదనపు కోర్టు సీనియర్ సివిల్ జడ్జి సత్యనారాయణ శనివారం ఆదేశించారు. ఈ వివరాలను లాయర్లు వెల్లడించారు. ఐసీడీఎస్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే హాస్టల్ కోసం హన్మకొండలోని బాలసముద్రంలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి నుంచి భవనం అద్దెకు తీసుకున్నారు.

దీని అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని కృష్ణా రెడ్డి 2009లో కోర్టును ఆశ్రయించారు. 2014లో కోర్టు రూ.3 లక్షలు అద్దె చెల్లించాలని తీర్పు చెప్పింది. అయినా అద్దె చెల్లించలేదు. దీంతో బాధితుడు మళ్లీ కోర్టుకు ఎక్కారు. కలెక్టర్ వాహనం జఫ్తు చేసుకొని బాధితుడికి అద్దె చెల్లించాలని కోర్టు నోటీసు ద్వారా తెలిపింది.

కారు జఫ్తుపై స్పందించిన ఆమ్రపాలి

కారు జఫ్తుపై స్పందించిన ఆమ్రపాలి

కలెక్టర్ కారు జఫ్తు చేయాలన్న కోర్టు ఆదేశాలపై ఆమ్రపాలి స్పందించారు. నోటీసు అందుకున్నామని, వారంలోగా అద్దె చెల్లిస్తామని రాతపూర్వకంగా తెలిపారు. మరోవైపు, ఇందుకు సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించారు.

కారు జఫ్తు కోసం వచ్చిన అధికారులు

కారు జఫ్తు కోసం వచ్చిన అధికారులు

కలెక్టర్ అద్దె బకాయి చెల్లించే వరకు కారును జఫ్తు చేయాలని, డబ్బులు చెల్లించాకే కారును తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిబ్బంది కలెక్టర్ ఆమ్రపాలి వినియోగిస్తున్న ఫార్చునర్ కారును సీజ్ చేసేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆమె వారంలో డబ్బు చెల్లిస్తానని చెప్పడంతో వారు వెనుదిరిగారని తెలుస్తోంది.

 ఇప్పటి దాకా తన దృష్టికి రాలేదని ఆమ్రపాలి

ఇప్పటి దాకా తన దృష్టికి రాలేదని ఆమ్రపాలి

కలెక్టర్ ఆమ్రపాలి కారును స్వాధీనం చేసుకునేందుకు శనివారం కోర్టు సిబ్బందితో పాటు బాధితుడు కృష్ణారెడ్డి కూడా కలెక్టరేట్‌కు వచ్చారు. దీంతో ఆమ్రపాలి షాక్ తిన్నారు. అంతేకాదు, ఈ విషయం తన దృష్టికి ఇప్పటి వరకు రాలేదన్నారు. తనకు ఎందుకు చెప్పలేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మొత్తం రూ.3,30,958 చెల్లిస్తామని సిబ్బందికి, బాధితుడికి చెప్పారు.

తక్కువ కాలంలో ప్రత్యేక గుర్తింపు

తక్కువ కాలంలో ప్రత్యేక గుర్తింపు

వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి రూరల్‌ ఇంచార్జ్ పాలనాధికారిగా కొనసాగుతున్నారు. ఆమె అతి తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు జిల్లాల బాధ్యతల నేపథ్యంలో సమావేశాలను ఒకేచోట నిర్వహిస్తుంటారు. ఈమె ఈ నెల 27 నుంచి వ్యక్తిగత కారణాలతో దాదాపు నెల రోజులు సెలవులో వెళుతున్నట్టుగా తెలుస్తోంది.

English summary
Warangal Urban Collector Amrapali has received a shock from the district court. For not paying the pending bills of the private building being used as the ICDS office, the district court on Saturday ordered the collector’s vehicle to be confiscated when the victim Krishna Reddy sought the court’s help to pay the pending bills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X