వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

30 జీవాలను చంపిన ఇసుక లారీ: డ్రైవర్‌ను వెంటాడి నరికారు

ఇసుక లారీ మేకల మందపైకి దూసుకెళ్లడంతో 30 మేకలు మృతి చెందిన సంఘటన భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ గ్రామం లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

|
Google Oneindia TeluguNews

వరంగల్: ఇసుక లారీ మేకల మందపైకి దూసుకెళ్లడంతో 30 మేకలు మృతి చెందిన సంఘటన భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ గ్రామం లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రత్య క్ష సాక్షుల కథనం ప్రకారం.. కుందూరుపల్లె గ్రామానికి చెందిన మేకలను ఏగుర్ల మల్లయ్య, చంద్రు అనే గొర్ల కాపరులు మేకలు కాసి చెల్పూర్ నుంచి కుందూరుపల్లెకు మేకల మందను తోలుకుంటూ వస్తున్న క్రమంలో చెల్పూర్ కేటీపీపీ సమీపంలోకి రాగానే కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు ఇసుక లోడుతో వస్తున్న లారీ అతివేగంతో వచ్చి మందపైకి దూసుకెళ్లింది.

దీంతో 30మేకలు అక్కడిక్కడే మృతి చెందాయి. మేకల కాపర్లు మల్లయ్య, చంద్రులు లారీని ఆపే ప్రయత్నం చేయగా లారీ డ్రైవర్ ఎండీ జమీల్ లారీని ఆపకుండా మందుకు వెళ్లడంతో ఆగ్రహించిన చంద్రు తన చేతిలో ఉన్న గొడ్డలి డ్రైవర్‌పైకి విసిరాడు. దీంతో గొడ్డలి జమీల్ మెడకు తగిలింది.

Warangal: Goatherd attacks driver

జమీల్ అయినా లారీ ఆపకుండా వెళ్తుండడంతో అక్కడే ఉన్న శివ అనే వ్యక్తికి చెందిన ద్విచక్రవాహనంపై చంద్రు వెంటపడి లారీని అడ్డుకొని డ్రైవర్‌ను పట్టుకొని దాడి చేశాడు. దీంతో గ్రామస్తులు అడ్డు కున్నారు. జమీల్ తీవ్రంగా గాయపడడంతో అ తడ్ని స్థానికులు 108 వాహనంలో వరంగల్‌లోని ఎంజీ ఎంకు తరలించారు.

డ్రైవర్ జమీల్ యాదాద్రి జిల్లా భువనగిరి చెందిన వాడని తెలిసింది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మేకల యజమానులు తమ మేకలు చనిపోవడంతో తమ జీవనాధారం కోల్పోయామని విలపించారు. విషయం తెలుసుకున్న గణపురం ఎస్సై ప్రవీణ్ కుమార్, భూపాలపల్లి సీఐ వేణు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమేదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

English summary
A lorry driver, who drove through a herd of goats, killing 30 of them, was chased down by the goatherd and hacked with an axe at Kudayyapalli in Jayashankar Bhupalapalli district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X