వరంగల్ టీఆర్ఎస్ లో కొత్త జోష్.. ఎన్నికలు ఏవైనా... ఎక్కడైనా.. ఓరుగల్లు నేతలు తగ్గేదేలే!!

తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పిన, టిఆర్ఎస్ పార్టీకి మరింత పట్టును అందించి దేశ రాజకీయాలకు ఊతం ఇచ్చిన మునుగోడు ఉపఎన్నికలో ఓరుగల్లు నుంచి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ నేతల పాత్ర గణనీయంగా ఉంది. ఎన్నికలు ఏవైనా సరే వరంగల్ జిల్లా గులాబీ నేతలు తమదైన శైలిలో దూకుడు చూపిస్తారు. మునుగోడు ఉప ఎన్నికల గెలుపులో వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ముఖ్య నేతల పాత్ర కీలకంగా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు జిల్లాలో నాయకులు మంచి జోష్ లో ఉన్నారు.

మునుగోడులో వరంగల్ జిల్లా నేతల మార్క్

మునుగోడులో వరంగల్ జిల్లా నేతల మార్క్

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వరంగల్ జిల్లా నుంచి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, డాక్టర్ టి రాజయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్... ఇలా ముఖ్య నాయకులు అందరూ తమకు కేటాయించిన గ్రామాలలో బలంగా ప్రచారం చేశారు.

 పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రచారం చేసిన ఒకే గ్రామంలో టిఆర్ఎస్ పార్టీకి 457 ఓట్ల మెజారిటీ

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రచారం చేసిన ఒకే గ్రామంలో టిఆర్ఎస్ పార్టీకి 457 ఓట్ల మెజారిటీ

ఫలితంగా గణనీయమైన మంచి ఫలితాలను సాధించారు. వరంగల్ జిల్లా నాయకులు బాధ్యత తీసుకున్న ప్రతి చోటా టిఆర్ఎస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చింది. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తనకు బాధ్యత ఇచ్చిన గ్రామంలో వెయ్యి ఓట్లకు టిఆర్ఎస్ పార్టీకి 457 ఓట్ల మెజారిటీ సాధించి తన సత్తా చాటుకున్నారు. ఒకే గ్రామంలో 457 ఓట్లు మెజార్టీ సాధించడం ఒక్క పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వల్లనే సాధ్యమైంది. క్లస్టర్ కు ఇన్చార్జిగా వ్యవహరించిన కిష్టాపురం రెవిన్యూ విలేజ్ పరిధిలో ప్రచారం నిర్వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి తాను ప్రచారం చేసిన పరిధిలో 187 ఓట్ల మెజారిటీ సాధించారు.

ఎవరికి వారే ... ప్రచారం చేసిన మెజార్టీ ఇలా

ఎవరికి వారే ... ప్రచారం చేసిన మెజార్టీ ఇలా

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన పొర్ల గడ్డ తండా ఎంపిటిసి పరిధిలో టిఆర్ఎస్ పార్టీ 288 ఓట్లు మెజారిటీని సాధించింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించిన గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ 166 ఓట్ల మెజారిటీని సాధించింది . రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేష్ , దాస్యం వినయ్ భాస్కర్ ఇన్చార్జిగా వ్యవహరించిన టిఆర్ఎస్ పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది. మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇన్చార్జిగా వ్యవహరించిన పల్లగుట్ట తండా లో టిఆర్ఎస్ పార్టీకి 151 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇవి మచ్చుకు మాత్రమే.

ఎన్నికలు ఏవైనా .. ఎక్కడైనా .. తగ్గేదేలే ..

ఎన్నికలు ఏవైనా .. ఎక్కడైనా .. తగ్గేదేలే ..

మొత్తంగా చూస్తే వరంగల్ జిల్లా నేతల మార్క్ మునుగోడు ఉప ఎన్నికల పోరులో స్పష్టంగా కనిపించింది. ఎన్నికలు ఏవైనా సరే.. ఎక్కడైనా సరే ఓరుగల్లు నేతలు తగ్గేది లేదని మరోమారు మునుగోడు ఉప ఎన్నికలతో నిరూపించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసి సాధించిన విజయంతో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నేతలు మంచి జోష్ లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+