గ్రేటర్ వరంగల్ లో కారు జోరు ... టీఆర్ఎస్ అభ్యర్థులదే పైచెయ్యి, కౌంటింగ్ లేటెస్ట్ అప్డేట్ ఇదే

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభం కాగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు కౌంటింగ్ అధికారులు. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించిన వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. ఇక కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధించారు. కరోనా నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Recommended Video

    Telangana Municipal Elections : కరోనా నిబంధనలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్...!!

    ఇప్పటివరకు టీఆర్ఎస్ ఖాతాలో 11 డివిజన్లు , మేయర్ అభ్యర్థి సుధారాణి విజయం

    ఇప్పటివరకు టీఆర్ఎస్ ఖాతాలో 11 డివిజన్లు , మేయర్ అభ్యర్థి సుధారాణి విజయం

    బ్యాలెట్ పేపర్లు లెక్కించే విధానం కాబట్టి ఫలితాలు ఆలస్యంగా వెలువడుతున్నాయి. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ప్రకారం చూస్తే టిఆర్ఎస్ పార్టీ 11 డివిజన్ల ను కైవసం చేసుకోగా, బిజెపి 3, కాంగ్రెస్ 1, ఐఏఎఫ్ బీ ఒకరు విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. మొత్తం 66 డివిజన్లు ఉన్న గ్రేటర్ వరంగల్లో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలలో ముందంజలో ఉంది.ఇప్పటివరకు వెల్లడించిన ఫలితాల ప్రకారం వరంగల్ మేయర్ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన గుండు సుధారాణి 29వ డివిజన్ నుంచి గెలుపొందారు.

    టీఆర్ఎస్ నుండి గెలిచిన అభ్యర్థులు వీరే

    టీఆర్ఎస్ నుండి గెలిచిన అభ్యర్థులు వీరే

    తొమ్మిదో డివిజన్ నుంచి టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చీకటి శారద, 13 డివిజన్ నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురేష్ జోషి ,23 వ డివిజన్ నుండి యెలుగం లీలావతి, 24వ డివిజన్ నుండి రామ తేజస్విని, 28 వ డివిజన్ నుంచి గందే కల్పన, 51 డివిజన్ నుంచి బోయినపల్లి రంజిత్ రావు, 60 వ డివిజన్ నుండి అభినవ్ భాస్కర్, 61వ డివిజన్ నుంచి ఎలకంటి రాములు, ఆరవ డివిజన్ లో చెన్నం మధు, ఏడవ డివిజన్లో వేముల శ్రీనివాస్ విజయం సాధించారు.

    ఇప్పటి వరకు బీజేపీ నుండి ముగ్గురి విజయం , కాంగ్రెస్ ఒకటి, ఐఏఎఫ్బీ ఒకరు విజయం

    ఇప్పటి వరకు బీజేపీ నుండి ముగ్గురి విజయం , కాంగ్రెస్ ఒకటి, ఐఏఎఫ్బీ ఒకరు విజయం

    ఇక బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో గట్టి పోటీనే ఇచ్చింది. బీజేపీ నుండి ఇప్పటివరకు ముగ్గురు విజయం సాధించినట్లుగా తెలుస్తోంది . 37 డివిజన్ రావుల కోమల, 52వ డివిజన్ చాడ స్వాతి ,59 వ డివిజన్ గుజ్జుల వసంత విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుండి తోట వెంకటేశ్వర్లు విజయం సాధించగా 22 వ డివిజన్ లో ఐఏఎఫ్బీ అభ్యర్థి బస్వరాజు కుమార్ విజయం సాధించారు. ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది.తాజా కౌంటింగ్ సరళిని బట్టి గ్రేటర్ వరంగల్ కూడా కారు ఖాతాలోనే చేరుతుందని, టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని అర్ధం అవుతుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+