లింగ నిర్థారణ పరీక్షలు, అబార్షన్లు.. ముఠా గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు
వరంగల్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా చట్టవిరుద్ధంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేసి అబార్షన్లు చేస్తూనే ఉన్నారు. వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం ఆకస్మిక తనిఖీలు చేసి అనేక స్కానింగ్ సెంటర్ల ను సీజ్ చేస్తున్నప్పటికీ, అబార్షన్లు చేసే ముఠా లో ఏ మాత్రం మార్పు రాలేదు.
గుట్టుచప్పుడు కాకుండా వరంగల్ సిటీలో అబార్షన్ ల దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా వరంగల్ సిటీ లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న, అబార్షన్లు చేస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం ట్రాప్ చేశారు. ఓ మహిళా ఎస్సైని అబార్షన్ కోసం పంపించి అక్కడ జరుగుతున్న తంతు చూసి ఆపై నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా, అబార్షన్లు చేస్తున్న ప్రైవేటు వైద్యులు సహా మొత్తం పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ నగరం నడిబొడ్డున ములుగు రోడ్డు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ దందా సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వందకుపైగా అబార్షన్లు జరిగాయని, లింగనిర్ధారణ పరీక్షలు చేసి, అబార్షన్లు చేయడమే పనిగా ఈ ఆసుపత్రిలో పలువురు ముఠాగా ఏర్పడి పనిచేస్తున్నారని అధికారులు గుర్తించారు.
ఆసుపత్రిలో నిర్వహించవలసిన రికార్డులను నిర్వహించడం లేదని గుర్తించారు. ఆపరేషన్ కేస్ షీట్లను కూడా సరిగ్గా నిర్వహించటం లేదని గుర్తించారు. ఆర్ఎంపీలు, ప్రైవేటు వైద్యులతో సహా మొత్తం పది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ ముఠా జిల్లావ్యాప్తంగా ఎంతగా విస్తరించింది అన్న దానిపై కూపీ లాగుతున్నారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. గర్భస్థ పిండం లింగ నిర్ధారణ పరీక్షలు ఎవరు చేసినా చట్టరీత్యా చర్య తీసుకుంటామని, కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications