ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదం: వరంగల్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: ఆస్టేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వరంగల్ యువకుడు దుర్మరణం చెందాడు. ఆస్ర్టేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న చక్రవర్తుల శ్రీవాత్సవ (24) రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

శ్రీవాత్సవ తండ్రి ఎన్వీఎస్ చారి కాకతీయ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. శ్రీవాస్తవ మృతితో ఆయన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఇన్నోవా కారు బోల్తా: నలుగురు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కకడే మృతి చెందగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఇన్నోవా కారు అదుపు తప్పి బోల్తా పడింది.
దీంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్రు ప్రారంభించారు.
అదుపుతప్పి షాపులోకి దూసుకెళ్లిన కారు
నిజామాబాద్ పట్టణంలోని ధర్నాచౌక్ వద్ద అదుపు తప్పిన ఓ కారు ఎదురుగా ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications