రేవంత్ మనవడి తీన్‌మార్ డాన్స్ చూస్తారా?

Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడి ఉత్సవాలకు నేటితో తెరపడనుంది. విఘ్న నాయకుడు నిమజ్జనానికి తరలుతున్నాడు. జంటనగరాల్లో కన్నుల పండువగా గణేష విగ్రహాల శోభాయాత్రలు మొదలయ్యాయి. పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ఈ తెల్లవారుజామునే ఆరంభమైంది. భారీ క్రేన్ సహాయంతో ఈ 70 అడుగుల మహా విగ్రహాన్ని ట్రాలీపైకి చేర్చారు. అనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ హారతి ఇచ్చి.. శోభాయాత్రను ప్రారంభించారు.

Watch CM Revanth Reddy s grandson dance during the Ganesh Nimajjanam in Hyderabad

నిమజ్జనం రోజు కావడంతో తెల్లవారు జాము నుంచే తండోపతండాలుగా ఖైరతాబాద్‌కు చేరుకున్నారు భక్తులు. భక్తిశ్రద్ధలతో మహాగణపతికి పూజలు చేశారు. గణపతి బొప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. ఘనంగా వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసంద్రంగా మారింది.

నగరవ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం చురుగ్గా సాగుతోంది. రోడ్లన్నీ శోభాయాత్రతో సందడిగా మారాయి. జంటనగరాలన్నీ కాషాయమయం అయ్యాయి. వక్రదంతుడి విగ్రహాలతో కూడిన భారీ ట్రాలీలు, లారీలు, ట్రాక్టర్లతో నిండిపోయాయి. వాటికి ఎక్కడా ఆటంకం కలగకుండా ఇప్పటికే వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పూజలను అందుకున్న వినాయకుడి విగ్రహం సైతం నిమజ్జనానికి తరలించారు. అందంగా అలంకరించిన ప్రత్యేక వాహనంలో గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. చివరి రోజు వినాయకుడికి ఘనంగా పూజలను నిర్వహించారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు.

ఆయన భార్య గీతా రెడ్డి, కూతురు నైమిష రెడ్డి, మనవడు రేయాన్ష్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేయాన్ష్ రెడ్డి వినాయకుడి మండపం వద్ద స్టెప్పులేశాడు. సంప్రదాయబద్ధ వస్త్రధారణతో కనిపించాడు. డప్పు శబ్దాలకు అనుగుణంగా హుషారుగా చిందులేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+