VIDEO:వీహెచ్, రాజనర్సింహా స్టెప్పులు, శ్రేణుల్లో జోష్, వీడియో
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో జోష్ వచ్చింది. రాహుల్ సహా నేతలు అంతా ఉత్సాహాంగా పాల్గొంటున్నారు. పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతున్నారు. ఇవాళ ఏకంగా నేతలు అంతా డ్యాన్స్ చేశారు. స్టేజీ మీద తమ పార్టీకి ఊపును తీసుకొచ్చారు.

జోష్..
రాహుల్ గాంధీ పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పాదయాత్రకు ప్రజల నుంచి ఊహించిన దాని కంటే అధికంగా స్పందన వస్తోంది. రాహుల్ గాంధీ యాత్ర సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతోంది. గురువారం రాత్రి పాదయాత్రను ముగించే సందర్భంగా జిల్లా పరిధిలో గల ఆందోల్‌లో బహిరంగ సభ జరిగింది.

నేతలతో కలిసి చిందులు
ఆందోల్ సభలో జనాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన వచ్చింది. రియాక్షన్ చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతల్లో జోష్ నింపింది. రాహుల్ గాంధీ ప్రసంగం ముగిసిన వెంటనే సంతోషం పట్టలేక మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన పక్కనే ఉన్న నేతలతో కలిసి చిందులేశారు.
రాజనర్సింహా, వీహెచ్
దామోదర రాజనర్సింహా స్టెప్పులను చూసిన సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా జత కలిపారు. తన వయస్సును కూడా లెక్క చేయకుండా డ్యాన్స్ చేశారు. ఇద్దరు కీలక నేతలు స్టేజీ మీద స్టెప్పులేశారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, నేతలు కేరింతలు కొట్టారు. వారిని మరింత జోష్ నింపే ప్రయత్నం చేశారు.

బ్రహ్మారథం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తెలంగాణ రాష్ట్రంలో జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అడుగడుగునా జనం బ్రహ్మారథం పడుతున్నారు. వారితో రాహుల్ కూడా కలిసిపోతున్నారు. పిల్లలతో పరుగు పందెం చేసి.. బంజారాలతో డ్యాన్స్ కూడా చేశాడు. పోతారాజులా వీరగోలతో కొట్టుకున్నాడు. బస్సు పైకి ఎక్కి మరీ ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications