నిండుకుండలా హుస్సేన్‌సాగర్: దిగువకు నీటి విడుదల, సిటీ ప్రజలకు అలర్ట్
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. బుల్కాపూర్, కూకట్ పల్లి, బంజరా, పికెట్ నాలాల నుంచి పెద్ద ఎత్తున వరదనీరు వస్తుండటంతో నీటిమట్టం పెరిగి హుస్సేన్ సాగర్‌లో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దాదాపు ఎఫ్టీఎల్కు చేరుకోవడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
హుస్సేన్ సాగర్‌లో వరదనీటి పరిస్థితిని జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ కూడా హుస్సేన్ సాగర్‌లోని నీటిమట్టంపై ఎప్పటికప్పుడు అధికారులను వివరాలడిగి తెలుసుకుంటున్నారు. సాగర్ నుంచి నీరును విడుదల చేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

24 గంటలపాటు నీటి వనరులపై నిఘా పెట్టాలని దానకిశోర్ సూచించారు. చెరువుల పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ముందు జాగ్రత్తచర్యలు చేపట్టాలని అధికారులను దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.
#Hussainsagar outflow #Rains#HyderabadRains pic.twitter.com/z4Z8O7EVBG
— Shareef (@shareef_journo) September 1, 2024
షేక్‌పేట, టోలిచౌకీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేశారు హైడ్రా కమిషనర్. టోలిచౌకి వద్ద రహదారిపై భారీగా నిలిచిన వరద నీటిని దగ్గరుండి సిబ్బందితో నాలాలోకి మళ్లించారు. అలాగే బేగంపేట ముంపు ప్రభావిత ప్రాంతాలతోపాటు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నాలాను, పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రంగనాథ్ ఆదేశించారు.
In the context of the heavy rains in the city, Inspected the Hussain Sagar gates along with MA & UD Principal Secretary Sri M. Dana Kishore IAS garu, GHMC Additional Commissioner, Zonal Commissioner & Other concerned GHMC officials today. @PrlsecyMAUD @GHMCOnline @TelanganaCMO pic.twitter.com/ugyJmCPTAj
— Mothe Srilatha Shoban Reddy (@SrilathaMothe) September 1, 2024
కాగా, ఆదివారం తెల్లవారుజాము నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటికి రావొద్దని నగర ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications