మంజీర, సింగూర్ లల్లో డెడ్ స్టోరేజ్: హైదరాబాద్ లో వాటర్ ఎమర్జెన్సీ

ఎల్ నినో దెబ్బ కొట్టింది. తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. పూర్తిగా నిరాశపరిచాయి. బంగాళాఖాతంలో అడపాదడపాగా ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల వల్ల వర్షాలు పడుతోన్నప్పటికీ.. అవి ఏ మాత్రం చాలట్లేదు. దీని ప్రభావం హైదరాబాద్ పైనా పడింది. ఇక్కడ మంచినీటి సంక్షోభం ఏర్పడింది. భూగర్భ జలాలు సైతం అడుగంటాయి. మంచినీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ వస్తోంది.

హైదరాబాద్ లో జలమండలి నీటి సరఫరా వేళలను కుదించడంతో కోటిన్నరకు పైగా ఉన్న జనాభా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటోంది. రోజు విడిచి రోజు అందించే తాగునీటిని.. ప్రస్తుతం మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వర్షపాతం తగ్గడంతో మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నాగార్జునసాగర్ వంటి జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటడం దీనికి కారణం.

Water Levels in the Himayat Sagar Osman Sagar Singur Manjeera reservoirs declining significantly

రాష్ట్రవ్యాప్తంగా 600కు పైగా మండలాల్లో సగానికి పైగా ప్రాంతాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 6,000కు పైగా చెరువులు, కుంటలు ఉండగా.. వాటిల్లో 500 చెరువుల్లో మాత్రమే కాస్తో కూస్తో నీళ్లు నిల్వ ఉంటోన్నాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు హైదరాబాద్ పరిస్థితి దీనికేమీ తీసిపోవట్లేదు. 16 మండలాల్లో మూడింట్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఫలితంగా భూగర్భ జలాలు మరింత తగ్గాయి. దీంతో వాటర్ వర్క్స్ అధికారులు మంచినీటి సరఫరాను కుదించారు.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీదే హవా: సీప్యాక్ ఒపీనియన్ పోల్ క్లియర్
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీదే హవా: సీప్యాక్ ఒపీనియన్ పోల్ క్లియర్

జనం వాటర్ ట్యాంకర్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. వాటర్ వర్క్స్ వద్ద రోజుకు సగటున 6,000 నుంచి 8,000 వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ నమోదవుతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా నగర శివారు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా తగ్గిపోవడంతో ప్రజలు ట్యాంకర్ల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇషాన్ కిషన్ అవుట్- వైభవ్ సూర్యవంశీకి సెకెండ్ ఛాన్స్.. !!
ఇషాన్ కిషన్ అవుట్- వైభవ్ సూర్యవంశీకి సెకెండ్ ఛాన్స్.. !!

నగరానికి ప్రధాన నీటి వనరులైన నాలుగు జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. నీటిపారుదల వివరాల ప్రకారం.. 3.5 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న ఉస్మాన్ సాగర్‌లో నీటి మట్టం 2.2 టీఎంసీలకు పడిపోయింది. హిమాయత్ సాగర్‌లో పూర్తి నిల్వ సామర్థ్యం 2.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.1 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటోంది. 312 టీఎంసీల సామర్థ్యం ఉన్న నాగార్జునసాగర్‌లో 184.2 టీఎంసీల నీరు మాత్రమే లభ్యమవుతోంది.

బంగారం ధరల పతనానికి చిన్న బ్రేక్.. !!
బంగారం ధరల పతనానికి చిన్న బ్రేక్.. !!

29.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సింగూరు రిజర్వాయర్ లో 3.4 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వాటర్ వర్క్స్ అధికారులు.. ఆయా రిజర్వాయర్లపై ఆధారపడిన ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించి, నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తోన్నారు. ఇందులో భాగంగా వెలిమెల వద్ద గోదావరి రింగ్ మెయిన్ పైప్‌లైన్‌, మంజీరా ఫేజ్-3, ఫేజ్-4 గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్లతో అనుసంధానిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+