జల జగడం .. ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి రాసిన లేఖపై తెలంగాణా సర్కార్ తీవ్ర అభ్యంతరం

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు నీటి దోపిడీ పై ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు చివరకు పవర్ వార్ తెరతీశాయి. తెలంగాణ అనుమతులు లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాయటంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద, తెలంగాణ పవర్ ప్లాంట్ల వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సాధారణ జలాశయాల వద్ద కేంద్ర దళాలను మోహరించాలన్న ఏపీ సిఎం ప్రతిపాదనపై కూడా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర బలగాలు ప్రాజెక్టుల భద్రతకే పరిమితం కావాలని, నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది.

Water War .. Telangana strongly objected the letter written by AP CM Jagan to Prime Minister Modi

నీటి కేటాయింపులు తాత్కాలికంగానే జరిగాయని, నీటి కేటాయింపులు ప్రాజెక్టుల వారీగా లేవని తాత్కాలిక కేటాయింపులను తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలంగాణ సర్కార్ అంటోంది.పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలని తెలంగాణ అభిప్రాయపడుతోంది. కృష్ణా నదీ జలాలను తాత్కాలికంగా కేటాయించడంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, అన్యాయం తెలంగాణ రాష్ట్రానికి జరిగితే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పు పడుతోంది.

లేఖలో, జగన్ మోహన్ రెడ్డి, విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ఏకపక్షంగా నీటిని తీసుకుంటుందని చేసిన ఆరోపణలు అవాస్తవం అని పేర్కొంది. ఇక ఇరు రాష్ట్రాల వాదనలతో కృష్ణా నదీ జలాల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కేంద్రం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా ప్రస్తుతానికి సైలెంట్ గా ఏం జరుగుతోందో చూస్తోంది. ఈ రెండు రాష్ట్రాల జల వివాదాలకు చెక్ పెట్టడానికి కేంద్రం ఏమైనా స్టెప్ తీసుకుంటుందో లేక ఇదే నాన్చుడు ధోరణితో తెలుగు రాష్ట్రాల పంచాయతీని మరింత ముదిరేలా చేస్తుందో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+