కేంద్రంపై యుద్ధం: కేసీఆర్‌కు మాజీ ప్రధాని ఫోన్: ఆ శక్తులపై పోరాటానికి అండ: పెరుగుతున్న మద్దతు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన యుద్ధానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ నాయకత్వానికి బల పరుస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇప్పటికే కేసీఆర్‌తో టచ్లో ఉన్నారు.

రాహుల్ వ్యాఖ్యలకు సైతం..
శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కేసీఆర్ స్వయంగా కలుసుకోనున్నారు. దీనికోసం ఆయన త్వరలో ముంబై వెళ్లనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో- దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలు, బీజేపీయేతర ముఖ్యమంత్రుల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు కేసీఆర్. ఈ విషయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి సైతం అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీకి అండగా నిలిచారు.

దేవేగౌడ ఫోన్..
ఈ పరిణామాల మధ్య- జనతాళ్ (సెక్యులర్) సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ- కేసీఆర్‌కు ఫోన్ చేశారు. జాతీయ స్థాయి రాజకీయాలపై చర్చించారు. కేసీఆర్ ఏర్పాటు చేయదలచుకున్నట్లుగా చెబుతోన్న మూడో ప్రత్యామ్నాయ కూటమి గురించి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కేసీఆర్ మొదలు పెట్టిన యుద్ధంలో తాము కూడా పాల్గొంటామని దేవేగౌడ భరోసా ఇచ్చారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరు కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.

మతతత్వానికి తావులేదంటూ..
కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ఆరంభించిన కేసీఆర్‌పై దేవేగౌడ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. శుభాకాంక్షలు తెలిపారు. భారత్ వంటి ప్రజాస్వామ్యయుత దేశంలో మతతత్వానికి తావు లేదని స్పష్టం చేశారు. మతం ముసుగులో ప్రజాస్వామ్యం, లౌకికవాద మూలాలను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని దేవేగౌడ ఆందోళన వ్యక్తం చేశారు. మతతత్వశక్తులను ఎదుర్కోవాలనుకోవడం ఓ భారీ యుద్ధంతో సమానమని వ్యాఖ్యానించారు.

దేశాన్ని కాపాడుకుందాం..
అలాంటి శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని దేవేగౌడ చెప్పారు. తాను చేపట్టిన పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు కేసీఆర్- ఈ సందర్భంగా దేవేగౌడకు కృతజ్ఞతలు తెలిపారు. మడమ తిప్పకుండా యుద్ధాన్ని సాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై నిర్వహించినట్లుగా చెబుతోన్న సర్జికల్ స్ట్రైక్స్‌పై కేసీఆర్ పలు అనుమానాలను లేవనెత్తిన రెండో రోజే- దేవేగౌడ ఆయనకు ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సర్జికల్ స్ట్రైక్స్‌పై..
ఈ విషయంలో ఆయన.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయనడానికి సాక్ష్యాధారాలను చూపించాలంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తాను అదే విషయంపై ప్రశ్నిస్తున్నానని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయనడానికి కేంద్ర ప్రభుత్వం సాక్ష్యాధారాలను చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నానని అన్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications