హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్క అవకాశమివ్వండి, 50ఏళ్లలో చేయలేంది ఐదేళ్లలో చేసిచూపిస్తాం: కెటిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మహానగర పాలకసంస్థను పాలించేందుకు ఒక్క అవకాశాన్ని టిఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని మంత్రి కేటీ రామారవు కోరారు. గతంలో టిడిపి, కాంగ్రెస్‌, ఎంఐఎంలు పాలించినా.. అవి 50ఏళ్లలో చేయని అభివృద్ధిని మేము ఐదేళ్లలో చేసి చూపిస్తామని అన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మీర్‌పేటలోని టీకేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం మహాసభ నిర్వహించారు.

సభకు ముఖ్య అతిథిగా హాజరైన కెటిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. నగరాన్ని తామే అభివృద్ధి చేశామని ఒకరు, ప్రపంచానికి పరిచయం చేశామని మరొకరు గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు.

ట్రాఫిక్‌కు సంబంధించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తెలంగాణ ప్రభుత్వం నగరంలోని 54 కూడళ్లను సిగ్నల్‌ ఫ్రీ జంక్షన్లుగా చేయడానికి మల్టీలెవల్‌ స్కై ఓవర్లను నిర్మించనున్నామన్నారు. పేదలకే కాదు మధ్య తరగతి ప్రజలకు రెండు పడక గదుల ఇళ్లను నిర్మించేందుకు కొత్తపథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి తెలంగాణ గడ్డమీద అడుగు కూడా పెట్టలేదన్నారు.

విదేశాలను తిరగడమే కానీ, దేశంలో తిరిగేందుకు ఆయనకు సమయం లేదని విమర్శించారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి హైదరాబాద్‌ గుండెకాయ లాంటిదని, ఈనగరం మీదనే తెలంగాణ భవిష్యత్‌ ఆధారపడి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు ఓటువేసి మేయర్‌ పదవిని అప్పగించాలన్నారు.

ప్రైవేటు కరస్పాండెంట్ల సమస్యలను తమదృష్టికి తీసుకొచ్చారని.. కచ్చితంగా అన్నింటినీ పరిష్కరిస్తామని, ఎన్నికల తర్వాత తీపి కబురు చెబుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కె.ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కాసిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు రామ్మోహన్‌గౌడ్‌, కె.మనోహర్‌రెడ్డి, అసోసియేషన్‌ నాయకులు పరంజ్యోతి, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భూపాల్‌రావు, శంకర్‌రావు, శేఖర్‌రావు, మధుసూదన్‌, గోపాల్‌రావు పాల్గొన్నారు.

కెటిఆర్

కెటిఆర్

మహానగర పాలకసంస్థను పాలించేందుకు ఒక్క అవకాశాన్ని టిఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని మంత్రి కేటీ రామారవు కోరారు. గతంలో టిడిపి, కాంగ్రెస్‌, ఎంఐఎంలు పాలించినా.. అవి 50ఏళ్లలో చేయని అభివృద్ధిని మేము ఐదేళ్లలో చేసి చూపిస్తామని అన్నారు.

కెటిఆర్

కెటిఆర్

హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మీర్‌పేటలోని టీకేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం మహాసభ నిర్వహించారు.

కెటిఆర్

కెటిఆర్

సభకు ముఖ్య అతిథిగా హాజరైన కెటిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారని తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

నగరాన్ని తామే అభివృద్ధి చేశామని ఒకరు, ప్రపంచానికి పరిచయం చేశామని మరొకరు గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు.

కెటిఆర్

కెటిఆర్

గతంలో అధికారంలో ఉన్న పాలకులు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయకుండా, ఇప్పుడు 18 నెలల ప్రభుత్వాన్ని మీరేం చేస్తున్నారని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

కెటిఆర్

కెటిఆర్

నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

నిజాం నవాబు నిర్మించిన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లే ఇప్పటివరకు తాగునీటి అవసరాలను తీర్చాయని.. ఏ ఒక్క నాయకుడు తాగునీటి కోసం చెరువులను తవ్వించిన దాఖలాలు లేవన్నారు.

కెటిఆర్

కెటిఆర్

మహానగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ఉత్తరం, దక్షిణం వైపు రూ.7,600 కోట్లతో రెండు జలాశయాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

కెటిఆర్

కెటిఆర్

నగరంలో విద్యుత్తు కోతలు లేకుండా రూ.2వేల కోట్లతో హైదరాబాద్‌ చుట్టూ రింగ్‌మెయిన్‌ ఏర్పాటు చేసుకోవడంతోపాటు హైల్యాండ్‌ పవర్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు.

English summary
IT minister KT Rama Rao, who is in the forefront of TRS GHMC poll campaign, said the party would seek ‘positive vote’ in polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X