సింధుకు గ్రాండ్ వెల్ కమ్ పక్కా: కేటీఆర్, గచ్చిబౌలిలో ఏకమైన వెటరన్స్
హైదరాబాద్ : దేశం మొత్తాన్ని ఒక్క తాటిపైకి తెచ్చిన సింధు గెలుపు కోసం ప్రతీ హైదరాబాదీ ఇప్పు టీవీ స్క్రీన్ లకు అతుక్కుపోయారు. సింధు స్వర్ణాన్ని ముద్దాడే క్షణం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ.. అంతకుమించిన ఉత్కంఠతో దేశమంతా ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ను వీక్షించడం కోసం సిద్దమైపోయింది.
ఇదిలా ఉంటే.. ఒలింపిక్స్ లో పతకం సాధించి దేశ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన సింధుకు హైదరాబాద్ లో ఘనస్వాగతం పక్కా అంటున్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంతో పాటు దేశానికి కీర్తి సాధించి పెట్టిన సింధుకు గ్రాండ్ గా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని చెప్పిన ఆయన..నేటి ఫైనల్లో సింధు స్వర్ణం సాధించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఏకమైన వెటరన్స్ :
బ్యాడ్మింటన్ మాత్రమే కాదు.. క్రికెట్, సైక్లింగ్, ఫుట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, షూటింగ్, పోలో, సెయిలింగ్, ట్రక్కింగ్ వంటి ఆటలకు ప్రాతినిధ్యం వహించిన ఎంతోమంది ఆటగాళ్లను అందించిన చరిత్ర హైదరాబాద్ కు ఉంది. సింధు ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో.. ఆ వెటరన్స్ అంతా ఇప్పుడు ఒకే వేదిక వద్దకు వచ్చి సింధు మ్యాచ్ ను వీక్షించడానికి సిధ్దమవడం విశేషం.
గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ పై మ్యాచ్ ను తిలకించేందుకు.. ప్రఖ్యాత షూటర్ గగన్ నారంగ్ వంటి వారు, సింధు తల్లిదండ్రులతో ఆడిన ఆటగాళ్లు, సలహాలు, శిక్షణ తీసుకున్న చాలామంది ఆటగాళ్లు ఇప్పుడు గచ్చిబౌలిలోని గోపిచంద్ అకాడమీకి చేరుకోవడం విశేషం. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కూడా గచ్చిబౌలిలోనే సింధు మ్యాచ్ ను వీక్షిస్తుండడం విశేషం.












Click it and Unblock the Notifications