కేరళ భవన్: ‘కేరళీయం’లో కెసిఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో ఎకరం భూమి కేటాయించి, వచ్చే ఏడాదికల్లా కోటి రూపాయలతో కేరళ భవన్ నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే ఏడాదికల్లా కేరళ భవన్‌ను పూర్తి చేసి కేరళీయం ఉత్సవాలను అందులో జరుపుకుందామని ముఖ్యమంత్రి చెప్పారు. కేరళ భవన్ నిర్మాణానికి సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో ఎకరం భూమి కేటాయించనున్నట్లు సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు.
బాలానగర్‌లో ఎస్‌ఎస్‌కెకె పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన కేరళీయం-2015 వేడుకలలో ముఖ్యమంత్రి పాల్గొని మలయాళంలో శుభాకాంక్షలు తెలియజేసి ఆశ్చర్యపర్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ మినీ ఇండియా లాంటిది ఇక్కడ అన్ని ప్రాంతాల వారిని నగరం తన ఒడిలో ఇముడ్చుకుందని ముఖ్యమంత్రి అన్నారు. కేరళవారికి ఎక్కడుంటే అక్కడి సంస్కృతిలో ఒదిగిపోయే గొప్ప గుణం ఉందని కొనియాడారు.
హైదరాబాద్‌లో కేరళవాళ్లు మూడు, నాలుగు లక్షల మంది ఉన్నారని, ఇక్కడ స్థిరపడిన కేరళీయులు స్థానికులతో కలిసి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారని ముఖ్యమంత్రి అన్నారు. దక్షిణ భారతంలో కేరళ అద్భుతమైన, అందమైన ప్రదేశమని, అక్కడికి ఒక్కసారి వెళ్తే తిరిగి రావాలనిపించదనీ అన్నారు. ‘గాడ్స్ ఓన్ సిటీ'గా కేరళకు పేరుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
ఏ ప్రాంతం బిడ్డలైనా హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే తన ఆకాంక్ష అని, అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. అయ్యప్పస్వామి వద్దకు వెళ్లే తెలంగాణ స్వాముల కోసం శబరిమలలో భవనం నిర్మించడానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించడం పట్ల కేరళ ముఖ్యమంత్రికి సభా వేదిక నుంచి సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు బూన నర్సయ్య గౌడ్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

కేరళీయం
నగరంలో ఎకరం భూమి కేటాయించి, వచ్చే ఏడాదికల్లా కోటి రూపాయలతో కేరళ భవన్ నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

కేరళీయం
వచ్చే ఏడాదికల్లా కేరళ భవన్‌ను పూర్తి చేసి కేరళీయం ఉత్సవాలను అందులో జరుపుకుందామని ముఖ్యమంత్రి చెప్పారు.

కేరళీయం
కేరళ భవన్ నిర్మాణానికి సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో ఎకరం భూమి కేటాయించనున్నట్లు సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు.

కేరళీయం
బాలానగర్‌లో ఎస్‌ఎస్‌కెకె పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన కేరళీయం-2015 వేడుకలలో ముఖ్యమంత్రి పాల్గొని మలయాళంలో శుభాకాంక్షలు తెలియజేసి ఆశ్చర్యపర్చారు.

కేరళీయం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ మినీ ఇండియా లాంటిది ఇక్కడ అన్ని ప్రాంతాల వారిని నగరం తన ఒడిలో ఇముడ్చుకుందని ముఖ్యమంత్రి అన్నారు. కేరళవారికి ఎక్కడుంటే అక్కడి సంస్కృతిలో ఒదిగిపోయే గొప్ప గుణం ఉందని కొనియాడారు.

కేరళీయం
హైదరాబాద్‌లో కేరళవాళ్లు మూడు, నాలుగు లక్షల మంది ఉన్నారని, ఇక్కడ స్థిరపడిన కేరళీయులు స్థానికులతో కలిసి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారని ముఖ్యమంత్రి అన్నారు.

కేరళీయం
దక్షిణ భారతంలో కేరళ అద్భుతమైన, అందమైన ప్రదేశమని, అక్కడికి ఒక్కసారి వెళ్తే తిరిగి రావాలనిపించదనీ అన్నారు. ‘గాడ్స్ ఓన్ సిటీ'గా కేరళకు పేరుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

కేరళీయం
ఏ ప్రాంతం బిడ్డలైనా హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే తన ఆకాంక్ష అని, అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

కేరళీయం
అయ్యప్పస్వామి వద్దకు వెళ్లే తెలంగాణ స్వాముల కోసం శబరిమలలో భవనం నిర్మించడానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించడం పట్ల కేరళ ముఖ్యమంత్రికి సభా వేదిక నుంచి సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.












Click it and Unblock the Notifications