వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో అడుగుపెడతా,అప్పుడు తెలుస్తుంది: పవన్ కళ్యాణ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను ఎవరికీ కూడ ఏజంట్‌ను కాదన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీలో జనసేన వాణిని విన్పిస్తామని పవన్ కళ్యాణ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తనకు అధికార కాంక్ష లేదని జనసేనాని స్పష్టత ఇచ్చారు.

Recommended Video

జనసేనలోకి కీలక నేతలు, ఎవరికి షాక్ !

జనసేనలోకి కీలక నేతలు: పవన్ గ్రీన్ సిగ్నల్,చర్చలుజనసేనలోకి కీలక నేతలు: పవన్ గ్రీన్ సిగ్నల్,చర్చలు

తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించి వచ్చిన తర్వాత ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ లో తెలంగాణలో మూడు రోజుల పర్యటన గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు రానున్ రోజుల్లో కూడ ఇంకా చాలా ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు పవన్ స్పష్టత ఇచ్చారు.

ముగ్గురిని పెళ్ళి చేసుకొన్నావు, నీకేం తెలుసు: పవన్‌పై విహెచ్ సంచలనంముగ్గురిని పెళ్ళి చేసుకొన్నావు, నీకేం తెలుసు: పవన్‌పై విహెచ్ సంచలనం

జవనవరి 27వ, తేది నుండి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. అనంతపురం జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు , కరువు సమస్యలపై అధ్యయనం చేయనున్నట్ట పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

అసెంబ్లీలో జనసేన వాణిని విన్పిస్తాం

అసెంబ్లీలో జనసేన వాణిని విన్పిస్తాం

తెలంగాణ, ఆం:ద్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2019లో అసెంబ్లీలో జనసేన వాణిని విన్పిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు రెండు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు ఆయన మరోసారి ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రచారం చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.ప్రజా సమస్యలపై జనసేన అసెంబ్లీలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఎవరికీ ఏజంట్‌ను కాను

ఎవరికీ ఏజంట్‌ను కాను

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు,తెలంగాణ సీఎం కెసిఆర్‌కు తాను ఏజంట్‌నంటూ కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు. రెండు రాష్ట్రాల్లో ఇద్దరికీ పడదని ఆయన గుర్తు చేశారు. వారిద్దరికీ తాను ఎలా ఏజంట్‌గా ఉంటానని పవన్ ప్రశ్నించారు. బురద చల్లేందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

అధికార కాంక్ష లేదు

అధికార కాంక్ష లేదు

తనకు అధికార కాంక్ష లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకొంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అధికార పక్షం వైపు ఉండడమో, సీఎం పదవి కోసం తాపత్రయపడే తత్వం తనది కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఎలా మాట్లాడాలో బేరీజు వేసుకొంటున్నా

ఎలా మాట్లాడాలో బేరీజు వేసుకొంటున్నా

తెలంగాణలో మూడు రోజుల పర్యటన విజయవంతమైందని భావిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై కార్యకర్తల నుండి వచ్చిన సమాచారం మేరకే తాను మాట్లాడానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణ సమస్యలను అధ్యయనం చేయడానికి ఇంకా సమయం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎలా మాట్లాడాలనే విషయమై బేరీజు వేసుకొంటున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.

తెలంగాణ సాధన ఓర్పుతో జరిగింది

తెలంగాణ సాధన ఓర్పుతో జరిగింది

తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఓర్పుతో, నేర్పుతో జరిగిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల తాను విదేశీ పర్యటనలో కూడ ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. కొన్ని సున్నితమైన విషయాలపై జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు.

కెసిఆర్ తో రాజీ లేదు

కెసిఆర్ తో రాజీ లేదు

తెలంగాణ సీఎం కెసిఆర్ తో రాజీ పడ్డారని కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.తెలంగాణలో సంభవించిన పరిణామాలపై మాత్రమే తాను మాట్లాడానని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాషను ఉపయోగించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.తనకు క్లారిటీ ఉందన్నారు. ఎవరికీ క్లారిటీ రావాలో ప్రజలే నిర్ణయిస్తారని పవన్ చెప్పారు.

English summary
Pawan Kalyan has started his political yatra from Telangana after his announcement of full-time involvement in politics. Pawan Kalyan speaking in this interview has stated that AP and Telangana are not different to him and reminded of his extensive campaigning in 2009 elections in Telangana. Pawan Kalyan explained that only time will answer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X