హిందూ దేశంగా మారుస్తాం, పట్టించుకోవడం లేదు: తొగాడియా
ఖమ్మం: భారతదేశాన్ని హిందూ దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్ కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా చెప్పారు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో పర్యటించిన ప్రవీణ్ తొగాడియా మీడియాతో మాట్లాడారు.

మత మార్పిడులను అడ్డుకోవడంతోపాటు గోపూజలు చేయడం, పేద హిందువులకు ఉచితంగా విద్యా, వైద్యం అందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామన్నారు. ముస్లింలు, క్రైస్తవులకు మక్కా, వాటికన్ సిటీల యాత్రలకు డబ్బులు ఇస్తున్నారని, కానీ హిందువులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
హిందువుల అభివృద్ధికి తాము కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. దేశంలో వంద కోట్ల మంది ఉన్న హిందువులు ఏకతాటిపైకి రావాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications