ప్రగతి భవన్ పేరు మారుస్తామంటూ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రజల తెలంగాణతో స్వర్ణ యుగానికి నాంది పలుకుతుందని అభిప్రాయపడుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. శుక్రవారం రాష్ట్రంలో పర్యటనించిన రాహుల్.. పినపాక, నర్సంపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు రాహుల్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌కు 'ప్రజా పాలన భవన్' అని పేరు మారుస్తామని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆ భవన్ తలుపులు 24 గంటలు ప్రజల కోసం తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను 72 గంటల్లో పరిష్కరిస్తామని రాహుల్ తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు అందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్భార్‌లు నిర్వహిస్తారని వెల్లడించారు. జవాబుదారీతనం, పారదర్శకత కోసం ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలంతా తమతో చేరాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
Congress’s victory will usher in a golden era of ‘Prajala Telangana’.
— Rahul Gandhi (@RahulGandhi) November 17, 2023
- The Pragathi Bhavan will be renamed ‘Praja Paalana Bhavan’, whose doors will be open to all, 24x7.
- The CM and all ministers will hold regular Praja Darbaars to listen to and resolve people’s grievances…
బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడిన రాహుల్
ముందుగా తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్‌ను.. ఆ తర్వాత దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించటమే కాంగ్రెస్ లక్ష్యమని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కొట్టిన దెబ్బతో తెలంగాణవైపు బీజేపీ చూసే పరిస్థితి లేకున్నా.. వెనకుండి బీఆర్ఎస్ను నడిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో సుడిగాలి పర్యటనలు చేశారు రాహుల్. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరాటం జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మీరంతా ప్రజల తెలంగాణ స్వప్నాన్ని చూడాలనుకుంటే.. మీ ముఖ్యమంత్రి మాత్రం ఒక కుటుంబ స్వప్నాన్ని నెరవేర్చారని రాహుల్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతి తెలంగాణలో ఎక్కడికెళ్లినా కనిపిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పరిస్థితిని తన కళ్లతో చూశానని తెలిపారు. రూ.లక్ష కోట్లను దోచుకున్నారన్నారు. కేసీఆర్ ప్రజల నుంచి ఎంత దోచుకున్నాడో.. ప్రతిపైసా లెక్కతీసి, తెలంగాణలోని పేద ప్రజల ఖాతాల్లో జమ చేస్తామని రాహుల్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications