తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తాం: సీఐఐ సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

వ్యాపారాలు, పెట్టుబడులకు తెలంగాణలో అద్భుతమైన వాతావరణం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని రకాల పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్: వ్యాపారాలు, పెట్టుబడులకు తెలంగాణలో అద్భుతమైన వాతావరణం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని రకాల పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. సోమవారం నగరంలోని బేగంపేటలో జరిగిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశం ప్రారంభమైంది. తొలిరోజు సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో మళ్లీ తమదే అధికారమన్న కేటీఆర్

తెలంగాణలో మళ్లీ తమదే అధికారమన్న కేటీఆర్

తెలంగాణలో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలకు మద్దతుగా హాజరైన ప్రతినిధులు చప్పట్లు కొట్టారు. దీంతో మీ స్పందన చూస్తుంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మరోసారి గెలిపించాలన్నారు.

పెట్టుబడులకు తెలంగాణలో విస్తృత అవకాశాలు

పెట్టుబడులకు తెలంగాణలో విస్తృత అవకాశాలు

లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని, వాటిని ఫార్మా దిగ్గజాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. సుల్తాన్‌పూర్ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. లైఫ్ సైన్స్ తోపాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందన్నారు. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటగా హైదరాబాద్ లోనే జరిగిందన్నారు. ప్రైవేటుగా రాకెట్ లాంచింగ్ చేసిన స్కైరూట్ ప్రతినిదులకు కేటీఆర్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌లోనే 50 శాతం టీకాల ఉత్పత్తి: కేటీఆర్

హైదరాబాద్‌లోనే 50 శాతం టీకాల ఉత్పత్తి: కేటీఆర్

అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు అతిపెద్ద క్యాంపస్ లను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. 2013తో పోలీస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయన్నారు. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోనే 9 బిలియన్ టీకాలు ఉత్పత్తు అవుతున్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే అవుతాయని పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే వినూత్న కార్యక్రమం చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముందు చూపుతోనే ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+