వెల్‌కమ్ ఫార్ములా సరే: సీట్ల కేటాయింపులో టీడీపీకి కేసీఆర్ స్వేచ్ఛనిస్తారా?

ఈ క్రమంలో గురువారం హైదరాబాద్ నగరంలోని ‘ఎన్టీఆర్ భవన్’లో టీ టీడీపీ ముఖ్య కార్యకర్తలతో విస్త్రుత సమావేశం ఏర్పాటు చేశారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్ పార్టీ గూటికో,

హైదరాబాద్: నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఎన్నికల సంగ్రామానికి ఏడాదిన్నర ముందే రాజకీయం వేడెక్కుతున్నది. తెలంగాణ సబ్బండ వర్ణాలు, ప్రజా సంఘాలు, పార్టీలు కలిసి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తామే సాధించామని సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సగర్వంగా ప్రకటించారు. తెలంగాణలోనే అతి తక్కువ సామాజిక వర్గం మాత్రమే సొంత రాష్ట్రాన్ని సంపాదించుకొచ్చిందని పేర్కొన్నారు. వివిధ సంఘాలు, పార్టీలతో కూడిన రాజకీయ జేఏసీ కూడా రాష్ట్ర సాధన ప్రక్రియలో పలు పోరాటాలు నిర్వహించింది. ఆందోళనలను సమన్వయం చేయడంలో విజయం సాధించింది. ఆ జేఏసీకి సారథ్యం వహిస్తున్న చైర్మన్ కోదండరాం అంటే తెలంగాణ సబ్బండ వర్ణాల్లో ఒకింత విశ్వసనీయత ఏర్పడింది. అదే రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో బలమైంది కూడా. ఈ సామాజిక వర్గాన్ని బద్నాం చేస్తే ఏకధాటిగా పాలన సాగించొచ్చునన్న వ్యూహం బయటకు వచ్చింది. ఇందుకు హైదరాబాద్ నగరం చుట్టూ.. తెలంగాణలో స్థిర పడిన సీమాంధ్రులు, ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గానికి దగ్గరై.. భవిష్యత్ ఎన్నికల్లో విజయం సాధించాలన్న వ్యూహానికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం పదును పెట్టింది. దీన్ని సహజంగానే రెడ్డి సామాజిక వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారు.
టీడీపీలో తొలి నుంచి పని చేస్తున్న రెడ్డి సామాజికవర్గం నేతలు.. టీఆర్ఎస్, టీడీపీ పొత్తునకు సరేననే అవకాశాలు తక్కువే. ఇటువంటి పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డి టీడీపీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ - టీఆర్ఎస్ మధ్య పొత్తులో ఎవరిది పై చేయి అన్నది ప్రశ్నార్థకంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓటుకు నోటు కేసులో చిక్కుకోవడంతోపాటు కీలక నేతలు పార్టీకి దూరమైన నేపథ్యంలో సీట్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేయగలరా? అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

టీఆర్ఎస్, పొలిటికల్ జేఏసీ కార్యాచరణతో ఇలా ఆందోళనలు

టీఆర్ఎస్, పొలిటికల్ జేఏసీ కార్యాచరణతో ఇలా ఆందోళనలు

2004లో కరీంనగర్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఇచ్చిన హామీకి కట్టుబడి.. పొరుగున సీమాంధ్రలో పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని తెలిసీ 2014లో యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కల సాకారం చేశారు. ఏళ్ల తరబడి సాగిన ఉద్యమానికి సారథ్యం వహించిన ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ అధినేతకు తోడుగా ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలోని రాజకీయ జేఏసీ కూడా అనుక్షణం సమర శంఖం పూరించి కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించింది. కానీ చమత్కారాలు, చెణుకులతో సబ్బండ వర్ణాలను విశ్వాసంలోకి తీసుకుని విజయం సాధించిన టీఆర్ఎస్ అధినేత - సీఎం కేసీఆర్.. భవిష్యత్‌లో తన పార్టీ రాజకీయ భవితవ్యాన్ని పటిష్ట పరుచుకోవాలన్న సంకల్పంతో చాతుర్యంతో కూడిన వ్యూహాలు అమలుచేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఉమ్మడి ఏపీలో సీమాంధ్ర నేతలదీ అదే వరుస

ఉమ్మడి ఏపీలో సీమాంధ్ర నేతలదీ అదే వరుస

తెలంగాణ గడ్డపై రెడ్డి సామాజిక వర్గం బలమైనదీ తొలి నుంచి రాజకీయాలను శాసిస్తూ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో సీమాంధ్ర నేతలు నాయకత్వం వహించినా.. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. ఆ సంగతి కూడా తెలంగాణ ప్రభుత్వాధినేతకు స్పష్టంగానే తెలుసు. ప్రత్యేకించి తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాంను లక్ష్యంగా చేసుకుని రెడ్డి సామాజిక వర్గంపై ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులు సంధించిన విమర్శనాస్త్రాలు ఎదురుతిరిగేలా కనిపించాయి. దీంతో మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు సీఎం కేసీఆర్ కొత్త వ్యూహాలు రచించడంలో నిమగ్నమయ్యారు.

17 మంది నేతలతో స్నేహ ‘హస్తం’ అందుకున్న రేవంత్

17 మంది నేతలతో స్నేహ ‘హస్తం’ అందుకున్న రేవంత్

పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ్య ప్రభుత్వాల మధ్య సఖ్యత కుదిరింది. ఏపీ సీఎం కూడా తెలంగాణలో కొడిగట్టిపోతున్న పార్టీ మనుగడ పరిరక్షణకు వచ్చే ఎన్నికల్లో పొత్తు యత్నాలకు తెర తీశారు. ఈ క్రమంలోనే వెలమలు, కమ్మ సామాజిక వర్గాల మధ్య ‘వెలకం' వ్యూహం వెలుగులోకి వచ్చింది. మొన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈ పొత్తు సంగతి తెలియక ఇది నచ్చక ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. తనతోపాటు మరో 17 మంది సీనియర్ నేతలతో ‘స్నేహ హస్తం' అందుకున్నారు. అందునా తెలంగాణ టీడీపీ నేతలే కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. తెలుగుదేశం పార్టీకి సీమాంధ్రలో కమ్మ సామాజిక వర్గాలు అండ. ఇటు హైదరాబాద్ నగరం చుట్టూ ఆ సామాజికవర్గం స్థిర పడి ఉన్నది. ఈ క్రమంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య పొత్తుకు తెర తీసింది.

2010 తర్వాత ఉప ఎన్నికల్లో టీడీపీ బలహీనం

2010 తర్వాత ఉప ఎన్నికల్లో టీడీపీ బలహీనం

రెండు కళ్ల సిద్ధాంతాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య దోబూచులాడిన టీడీపీ అధినేత చంద్రబాబు తన ద్రుష్టంతా ఆంధ్రప్రదేశ్ వైపే పెట్టారు. ఆయన వ్యూహాత్మకంగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో 2010 నుంచి తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొంది తన బలం పెంచుకున్నది. ఈ విషయం గమనించి ఎమ్మార్పీఎస్ మద్దతుతో తెలంగాణలో వస్తున్న మీ కోసం యాత్ర పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని.. బీసీ నాయకుడు ఆర్ క్రుష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించి 15 స్థానాల్లో విజయం సాధించగలిగారు.

రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఇలా సారథ్య బాధ్యతలు

రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఇలా సారథ్య బాధ్యతలు

కానీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి తోడు 2015లో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దాంతో ఆయన తన రాజకీయ కార్యకలాపాలు ఏపీపైనే ద్రుష్టి సారించారు. ఫలితంగా తెలంగాణలో దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. కానీ టీఆర్ఎస్ పార్టీతో తలపడి ఓటుకు నోటులో చిక్కుకున్న రేవంత్ రెడ్డి చివరకు తన కూతురు నిశ్చితార్థం కోసం చివరి క్షణాల్లో జైలు నుంచి బయటకు వచ్చారు. ఇది ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. అందుకే టీఆర్ఎస్ పార్టీతో పొత్తును వ్యతిరేకించారు. మూడున్నరేళ్లుగా పార్టీపై పట్టు, దూకుడు తెలుగు తమ్ముళ్లంతా ఆయన నాయకత్వంపై మక్కువ పెంచుకున్నారు. 17 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరితో సుమారు 250 మంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి దుస్థితికి చేరుకున్నదో అవగతమవుతూనే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+