రెండో రాజధానిగా వరంగల్: ఎయిర్‌పోర్టు అందుబాటులోకి అప్పుడే!
వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం ఆయన వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఇక్కడి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. అయితే, జలాశయానికి సంబంధించిన వివరాలను అధికారులను అడగగా సరిగా స్పందించకపోవడంతో అధికారుల తీరుపై మంత్రి మండిపడ్డారు.

ఈ క్రమంలోనే మంత్రి రాష్ట్ర రెండో రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
కేంద్రం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మరోవైపు వరంగల్ నగరంలోని పలు అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. త్వరలోనే నగరంలోని కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.












Click it and Unblock the Notifications