బీహర్ తరహాలో తెలంగాణలో కూటమి: పవన్ కళ్యాణ్ తో తమ్మినేని చర్చలు
బీహర్ తరహలో కూటమి లేదా ఫ్రంట్ ఏర్పాటుకు తెలంగాణలో విపక్షాలు రంగం సిద్దం చేస్తున్నాయి.కెసిఆర్ ను ఎదుర్కొనేందుకు ఇదే మార్గమని ఆ పార్టీలు తలపోస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు
హైదరాబాద్: బీహర్ తరహలో కూటమి లేదా ఫ్రంట్ ఏర్పాటుకు తెలంగాణలో విపక్షాలు రంగం సిద్దం చేస్తున్నాయి.కెసిఆర్ ను ఎదుర్కొనేందుకు ఇదే మార్గమని ఆ పార్టీలు తలపోస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రాజకీయ శక్తుల పునరేకీకరణ అవసరమని విపక్షాలు భావిస్తున్నాయి. ఈ మేరకు కెసిఆర్ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.ఈ మేరకు రాష్ట్రంలో కలిసొచ్చే బలమైన రాజకీయ ఐక్యవేదిక ఏర్పాటు కోసం సిపిఎం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకొన్నాయి. తెలంగాణ అభివృద్ది కోసం రాజకీయపార్టీల పునరేకీకరణ అవసరం అంటూ టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కొత్త పల్లవి అందుకొన్నారు.
ఇతర పార్టీల నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొన్నారు. ఈ ఆపరేషన్ ఆకర్ష్ లో టిడిపి తెలంగాణలో తీవ్రంగా నష్టపోయింది.
అయితే వచ్చే ఎన్నికల కోసమే టిఆర్ఎస్ అధినేత వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నాడు. ఇతర పార్టీలను మానసికంగా దెబ్బతీసే ఎత్తుగడలతో వ్యవహరిస్తున్నాడు.దీంతో ఇతర పార్టీలకు తెలంగాణలో మనుగడ లేదనే అభిప్రాయాలను కల్పించే పరిస్థితి తెచ్చింది టిఆర్ఎస్.
ఈ పరిస్థితుల్లో కెసిఆర్ వ్యతిరేక శక్తులు, పార్టీల పునరేకీకరణ అవసరాన్ని విపక్షాలు గుర్తించాయి. ఈ మేరకు సిపిఎం రాజకీయశక్తుల పునరేకీకరణకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఇతర పార్టీలతో చర్చలను ప్రారంభించింది.
సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన తర్వాత ఇటీవల హైద్రాబాద్ కు వచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో టిడబ్ల్యుజెఎఫ్ సోమవారం నాడు మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

పవన్ కళ్యాణ్ తో సిపిఎం నేత తమ్మినేని చర్చలు
2014 ఎన్నికల సమయంలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశాడు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన టిడిపి బిజెపి కూటమికి మద్దతును ప్రకటించారు.2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయవేదిక ఏర్పాటు కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ తో సిపిఐ నాయకులు ఇప్పటికే చర్చించారు. మరో వైపు సిపిఎం నాయకులు ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు విషయమై ఆయనతో చర్చించనున్నట్టు తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.

గద్దర్ తో చర్చించిన సిపిఎం
సుదీర్ఘకాలంపాటు మావోయిస్టు పార్టీతో కలిసి పనిచేసిన ప్రజా యుద్దనౌక గద్దర్ ఆ పార్టీతో తెగతెంపులు చేసుకొన్నాడు. ఈ మేరకు ప్రత్యామ్నాయ విధానాల కోసం ప్రజల వద్దకు వెళ్ళనున్నట్టు ప్రకటించారు.అదే సమయంలో తెలంగాణలో కెసిఆర్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఫ్రంట్ రూపకల్పనకు సిపిఎం సన్నాహాలు చేస్తోంది.ఈ విషయమై గద్దర్ తో చర్చించినట్టు సిపిఎం ప్రకటించింది. సిపిఎం నిర్వహించిన మహజన పాదయాత్రలో గద్దర్ స్వయంగా పాల్గొని సంఘీభావం తెలిపారు.

కోదండరామ్ తో చర్చలకు రఢీ
బిజెపి రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్ తో ఇటీవల టిజెఎసి చైర్మెన్ కోదండరామ్ చర్చించారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని లక్ష్మణ్ కోదండరామ్ కు హమీ ఇచ్చారు.అయితే ఫ్రంట్ ఏర్పాటు చేయాలని లక్ష్మణ్ సూచించారు.అయితే ఫ్రంట్ ఏర్పాటు చేస్తే తాము సహకరిస్తామని లక్ష్మణ్ చెప్పారు.కెసిఆర్ విధానాలనై టీజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ఒంటి కాలిపై లేస్తున్నారు. కెసిఆర్ వ్యతిరేక శక్తులను కూడగట్టేపనిలో భాగంగా టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ తో చర్చించనున్నట్టు సిపిఎం ప్రకటించింది. మరో వైపు సామాజిక వేత్త మాజీ జస్టిస్ చంద్రకుమార్ లతో కూడ చర్చలు చేయనున్నట్టు సిపిఎం ప్రకటించింది.

2019 ఎన్నికలకు ముందే ఫ్రంట్
2019 ఎన్నికలకు ముందుగానే ఫ్రంట్ ఆవిర్భావం చేయాలని సిపిఎం తలపెట్టింది. ఈ మేరకు ఆయా పార్టీలు, శక్తులు, ప్రజాసంఘాలతో సిపిఎం చర్చలు చేయనుంది.ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చర్చిస్తున్నారు.అదే సమయంలో అన్ని పార్టీలు కామన్ మినిమన్ ప్రోగ్రామ్ ఏర్పాటుచేసుకొని ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

టిడిపి సైతం ప్రంట్ తోనే
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ విధానాలతో ప్రంట్ లేదా రాజకీయ వేదిక ఏర్పాటు విషయంలో తాము సహకరిస్తామని టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. టిఆర్ఎస్ అనుసరించిన రాజకీయ ఎత్తుగడలతో టిడిపి తీవ్రంగా నష్టపోయింది. ఈ పరిస్థితుల్లో తిరిగి కోలుకోనేందుకుగాను కెసిఆర్ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు టిడిపి కూడ ఈ ఫ్రంట్ తో ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ ప్రంట్ ఏర్పాటులో తాము కీలకపాత్ర పోషిస్తామని టిడిపి ప్రకటించింది.

కెసిఆర్ వి నియంతృత్వ పోకడలు
ముఖ్యమంత్రి కెసిఆర్ వి నియంతృత్వ పోకడలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.తానే అసలైన కమ్యూనిష్టు అని చెప్పుకొనే అర్హత కెసిఆర్ కు లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారాయన.పాదయాత్ర సందర్భంగా తాము చూసిన ప్రజల బాధలను ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందున్న పరిస్థితులే ఇంకా ఉన్నాయన్నారు. మరో వైపు తెలంగాణ రాకముందు 70వేల కోట్ల అప్పులుంటే, తెలంగాణ వచ్చాక 70 వేల కోట్ల అప్పులు చేశారని కెసిఆర్ విధానాలపై ఆయన మండిపడ్డారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications