కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేస్తాం.!ఆశీర్వచన కార్యక్రమంలో బండి సంజయ్.!

హైదరాబాద్ : రాష్ట్రంలో కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేసే వరకు బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. చంద్రశేఖర్ రావు అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతం చేసి ప్రజాస్వామిక తెలంగాణ సాధించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం బీజేపీ సాగిస్తున్న మహోద్యమానికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని మరోసారి హామీ ఇచ్చారు.

 పార్టీ పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు పూర్తి.. బండి సంజయ్ కు వేద పండితుల ఆశీర్వచనం

పార్టీ పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు పూర్తి.. బండి సంజయ్ కు వేద పండితుల ఆశీర్వచనం

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను పార్టీ సీనియర్ నేతలు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన 'ఆశీర్వచన' కార్యక్రమానికి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుండి వచ్చిన వేద పండితులు, పూజారులు వేద మంత్రోచ్చారణాలతో ఆశ్వీరదించారు. మెట్ పల్లి స్వామిజీ ప్రణవానంద, వేములవాడ రాజన్న ఆలయ పూజారులు బండి సంజయ్ కు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.

 ప్రజాస్వామిక తెలంగాణను సాధిస్తాం.. బీజేపీ మహోద్యమానికి మద్దత్తివ్వాలన్న బండి సంజయ్

ప్రజాస్వామిక తెలంగాణను సాధిస్తాం.. బీజేపీ మహోద్యమానికి మద్దత్తివ్వాలన్న బండి సంజయ్

తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ(సంస్థాగత) లకు ప్రత్యేక క్రుతజ్ఝతలు తెలిపారు బండి సంజయ్. ఇంత గొప్ప పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉందని, ప్రధాని మోదీ స్పూర్తితో ముందుకు సాగుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీలేవీ నెర్చవేర్చకుండా జిమ్మిక్కులు చేస్తున్నారని, చంద్రశేఖర్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు బండి సంజయ్. వారికి భరోసా కల్పించేందుకు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ ఈ రెండేళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టందన్నారు.

 అధికారంలోకి రావడం ఖాయం..నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తామన్న సంజయ్

అధికారంలోకి రావడం ఖాయం..నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తామన్న సంజయ్

అంతే కాకుండా రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం ఉద్యమాలు చేశామని, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీక్రుతమైయ్యామని బండి సంజయ్ కుమార్ గుర్తు చేసారు. ఇందుకోసం తనతోసహా అనేక మంది జైలుకు వెళ్లిన సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం కార్యకర్తలు తెగించి కొట్లాడుతున్నామని, అనేక కేసులు ఎదుర్కొంటూ జైలు జీవితం గడిపారని ఆవేదన వ్యక్తం చేసారు. అయినా వెనుకాడకుండా, అధైర్యానికి లోనుకాకుండా పోరాడుతున్న కార్యకర్తలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానన్నారు బండి సంజయ్.

 ఏప్రిల్ 14 నుండి రెండోదశ పాదయాత్ర..ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యమన్న బండి..

ఏప్రిల్ 14 నుండి రెండోదశ పాదయాత్ర..ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యమన్న బండి..

ప్రజా ఆకాంక్షలను నెరవేర్చేందుకు, ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం బీజేపీ పోరాడుతుందన్నారు. అధికారానికి దగ్గరగా వచ్చామని, ఏ ఎన్నిక వచ్చినా బీజేపీ కైవసం చేసుకుని సత్తా చూపుతోందన్నారు. ఎంత డబ్బు వెదజల్లినా, అధికార కుట్రలు చేసినా, మరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు బీజేపీవైపు ఉన్నారని, డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని కోరుకుంటున్నరన్నారు సంజయ్. డాక్టర్ కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, రఘునందన్ తదితరులు పుష్పగుచ్చం, శాలువాతో సంజయ్ ను సత్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+