హైదరాబాద్ లో రచ్చ: ఆ ప్రదేశానికి కొత్త పేరు ప్రతిపాదించిన కేటీఆర్

తెలంగాణ సంస్కృతిని అధికార కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం నుండి బతుకమ్మను తొలగించడం ద్వారా రాష్ట్ర గుర్తింపును దెబ్బతీసిందని, తెలంగాణ సంస్కృతికి ద్రోహం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలంగాణ తల్లి నుండి బతుకమ్మను లాక్కున్న దుష్టశక్తులను తరిమికొట్టే వరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆపదని ఆయన పునరుద్ఘాటించారు.

హైదరాబాద్‌లో పీపుల్స్ ప్లాజాలో బీఆర్‌ఎస్ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను మార్చివేయడం, బతుకమ్మను తొలగించడం ద్వారా ఇక్కడి ప్రజలు, సమాజం, సంప్రదాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం కించపర్చిందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ గుర్తింపును తొలగించేలా చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు.

We will rename People s Plaza as Bathukamma Plaza says KTR

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పీపుల్స్ ప్లాజా పేరును బతుకమ్మ ప్లాజా'గా మారుస్తామని కేటీఆర్ అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడానికి వీలుగా ఈ ప్రదేశాన్ని శాశ్వత వేదికగా మార్చుతామని చెప్పారు. తెలంగాణ భాష, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్నారని గుర్తు చేశారు. ఒకప్పుడు అణచివేతకు గురైన తెలంగాణ మాండలికం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందిందని, ఈ భాషలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

"వారసిగూడలో ఉన్నా, వాషింగ్టన్‌లో ఉన్నా, అమీర్‌పేట్‌లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఖైరతాబాద్‌లో ఉన్నా, ఖతార్‌లో ఉన్నా, మన ప్రజలు మన మాతృభాషలో గర్వంగా మాట్లాడాలని కేసీఆర్ కోరుకున్నారు. అందుకే మనం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం" అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ అమరవీరులకు కేటీఆర్ నివాళి అర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన పిల్లల చిరునవ్వులను ప్రతి బతుకమ్మ మోస్తుందని చెప్పారు.

26వ తేదీన పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతోన్న నేపథ్యంలో కేటీఆర్ పేరు మార్పు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఆక్రమణలకు గురైన చెరువు బతుకమ్మ కుంట. దీన్ని హైడ్రా పునరుద్ధరించింది. ఆక్రమణల నుంచి విడిపించింది. అక్రమ నిర్మాణాలను తొలగించింది. దీన్ని మరో ట్యాంక్ బండ్ గా డెవలప్ చేసింది రేవంత్ సర్కార్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+