హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాట్లాడేందుకు ప్రయత్నించాం, కానీ, మద్దతుకోసం కెసిఆర్ కు లేఖ: మీరాకుమార్

సిద్దాంతాల కోసమే తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ స్పీకర్ మీరాకుమార్ చెప్పారు. సోమవారం నాడు ఆమె హైద్రాబాద్ కు చేరుకొన్నారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సిద్దాంతాల కోసమే తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ స్పీకర్ మీరాకుమార్ చెప్పారు. సోమవారం నాడు ఆమె హైద్రాబాద్ కు చేరుకొన్నారు.

గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన 17 రాజకీయపార్టీలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎంఐఎంను కూడ మద్దతివ్వాలని కోరుతామన్నారు.

టిఆర్ఎస్ మద్దతు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించామని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. తాను స్పీకర్ గా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

We wrote a letter for supports in presidential elections to Kcr: Meerakumar

తెలంగాణ ప్రజల ఆాకాంక్షలను నెరవేర్చేందుకే యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఇచ్చిందని మీరాకుమార్ గుర్తుచేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకుగాను ఆమె సోమవారం నాడు హైద్రాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.

విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్‌ సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్ధాంతాల కోసమే రాష్ట్రపతి ఎన్నికలలో నిలబడినట్లు తెలిపారు. తనకు మద్దతు ప్రకటించిన 17 రాజకీయ పార్టీలకు మీరా కుమార్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఎంఐఎంను కూడా మద్దతు ఇవ్వాలని కోరతామని ఆమె పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ మద్దతు కోసం ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించామని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే యూపీఏ తెలంగాణ ఇచ్చిందని మీరా కుమార్‌ పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె ఈ రోజు ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీరా కుమార్‌కు కాంగ్రెస్‌ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

కెసిఆర్ కు లేఖ రాశాం

Recommended Video

రాష్ట్రనతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు లేఖరాసినట్టు ఆమె చెప్పారు. తాను స్పీకర్ గా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర బిల్లు పాసైందని ఆమె గుర్తుచేశారు. సబర్మతి ఆశ్రమం నుండి తాను ప్రచారాన్ని మొదలు పెట్టినట్టు చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అంతరాత్మ ప్రబోధానుసారం ఓటువేయాలని ఆమె కోరారు.

English summary
We wrote a letter for support in presidential elections to Trs chief Kcr said Meerakumar on Monday in Hyderabad. she met congress party leaders in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X