Heavy rain: తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్

హైదరాబాద్: గత రెండు మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలుకురుస్తున్నాయి. తాజాగా, తెలంగాణ‌లో రాగ‌ల మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది. శనివారం రాత్రి నుంచే ఆదివారం వరకు హైదరాబాద్ తోపాలు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి.

ఇక, ఆదివారం నుంచి సోమ‌వారం వ‌ర‌కు మంచిర్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, నాగ‌ర్‌క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ అత్యంత భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.

weather update: next three days heavy rains in telangana, orange alert for these districts

ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, ములుగు, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ‌, గ‌ద్వాల జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొంది.

సోమ‌వారం నుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌ర‌కు నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ అత్యంత భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాళ్లకు శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, జోగులాంబ గ‌ద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంద‌ని చెప్పింది.

మంగ‌ళ‌వారం నుంచి బుధ‌వారం వ‌ర‌కు నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌కు అతిభారీ వ‌ర్ష సూచ‌న ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ పేర్కొంది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లోని అవసరమైతేనే ప్రజలు తమ ప్రయాణాలను కొనసాగించాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+