రైతుల కోసం కోట్ల రూపాయలిచ్చిన ఈ ఎమ్మెల్యే సూపరెహే!

ప్రజాప్రతినిధి అన్నవాళ్లు ప్రజల సమస్యలను పరిష్కరించాలి. ప్రజల చేత, ప్రజలతో, ప్రజల కోసం ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, సొంత లాభం చూసుకుంటున్న ప్రస్తుత కాలంలో తన నియోజకవర్గంలో రైతులు సంక్షేమం కోసం, రైతులు యూరియా కష్టాలు తీర్చడం కోసం ఆసక్తికరమైన పనిచేశారు మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఔదార్యం
తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో అల్లాడుతున్నారు. యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ముందు, రైతువేదికల ముందు పడిగాపులు పడుతున్నారు. యూరియా వెయ్యక పంటలు పాడై పోతున్నాయని లబోదిబోమంటున్నారు. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే అన్నదాత యూరియా దొరకక తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. ఇక ఇటువంటి సమయంలో ప్రజాప్రతినిధులు వాళ్ళ సమస్యలను తీర్చడానికి తమవంతుగా ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నమే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేశారు.

Well done MLA Laxma Reddy gave 2 crore rupees check to cm revanth reddy for farmers urea

Take a Poll

లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా
ఇప్పటికే సేవా గుణానికి ప్రతీకగా చెప్పుకునే ఆయన మరోమారు రైతుల కోసం తన పెద్ద మనసును చాటుకున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం లోని లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా చొప్పున అందించాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని తన కుటుంబ సభ్యులతో సహా కలిసి రెండు కోట్ల రూపాయల చెక్ అందజేశారు.

కొడుకు పెళ్లి రిసెప్షన్ కోసం సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే
ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న కుమార్ రెడ్డి వివాహం జరిగింది. అయితే మిర్యాలగూడలో భారీగా రిసెప్షన్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించి నియోజకవర్గ ప్రజలను కూడా పిలిచి ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్న కారణంగా రిసెప్షన్ కు హాజరు కావడానికి సమయం ఇవ్వకపోవడంతో లక్ష్మారెడ్డి సైతం రిసెప్షన్ ను నిర్వహించలేదు.

సీఎం రేవంత్ రెడ్డికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
ఈ క్రమంలో తన కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం దాచిపెట్టిన డబ్బులను రైతు సంక్షేమం కోసం ఇవ్వాలని భావించిన ఆయన రెండు కోట్ల రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన సతీమణి మాధవి, కుమారుడు సాయి ప్రసన్న కుమార్, వెన్నెల దంపతులు, చిన్న కుమారుడు ఈశ్వర్ రెడ్డి తో కలిసి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి చెక్కును అందజేశారు.

రైతుల కోసం ఎమ్మెల్యే దాతృత్వం
రైతుల కోసం తన దాతృత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే తీరుపైన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి ఎమ్మెల్యేలు ఉంటే అయినా రైతుల కష్టాలు తీరుతాయని ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయి అని వారు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+