ఏం సాధించారని కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు.?కార్యవర్గ సమావేశంలో నిలదీసిన బీజేపి.!

హైదరాబాద్ : తెలంగాణలో కొలువులు కావాలంటే కమలం రావాల్సిందేననే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ ఉంటే తెలంగాణకు ఎంతో మేలు జరిగేదని, దీనిని ద్రుష్టిలో ఉంచుకుని డబుల్ ఇంజిన్ సర్కారుంటేనే తెలంగాణలో డబుల్ అభివ్రుద్ధి సాధ్యమనే అంశాన్ని గడపగడపకూ తీసుకెళ్లాలని కోరారు. అట్లాగే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంతోపాటు తెలంగాణకు చేకూర్చిన ప్రయోజనాలను ఇంటింటికీ తెలియజేసేందుకు ఈనెల 30 నుండి వచ్చే నెల 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలను కాపాడే ఏకైక పార్టీ బీజేపి : హైదరాబాద్ లోని చంపాపేటలో సోమవారం బండి సంజయ్ అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, డాక్టర్ లక్ష్మణ్, మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మరళీధర్ రావు, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, తెలంగాణ రాష్ట్ర సహ ఇంఛార్జీ అరవింద్ మీనన్, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ కేవీఎన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ ప్రారంభోపన్యాసం చేసారు.

 bandi
కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే : తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు క్రుషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు బండి సంజయ్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కుంచుకోవడం తథ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను గ్రామగ్రామాన, గడప గడపకూ చేర్చాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. దేశంతోపాటు తెలంగాణ అభివ్రుద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తున్నా చంద్రశేఖర్ రావు ప్రభుత్వ మూర్ఖత్వంతో అనుకున్న స్థాయిలో అభివ్రుద్ధి జరగడం లేదన్నారు. కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను, ఇస్తున్న నిధులను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని బండి సంజయ్ కుమార్ తెలిపారు.

విశ్వాస ఘాతకుడు కేసీఆర్ : గులాబీ సర్కార్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలపై బీజేపీ నిలదీస్తుంటే చంద్రశేఖర్ రావు ఓర్చుకోలేకపోతున్నడని, ఒకనాడు మోదీని విశ్వగురుగా, నిజాయితీపరుడిగా కీర్తించిన చంద్రశేఖర్ రావే ఇవాళ అవినీతిపరుడు, రాక్షసుడంటూ తిడుతున్నడని బండి సంజయ్ మండి పడ్డారు. బీజేపీని ఓడించేందుకు దేశమంతా తిరుగుతూ పైసలు పంచుతున్నడని, చంద్రశేఖర్ రావు లాంటి నీచుడిని, విశ్వాస ఘాతకుడిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు బండి సంజయ్. చంద్రశేఖర్ రావు మొన్నటి కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ ను మోసం చేసిండని, తెలంగాణ కోసం మొదటి నుండి నిలబడి కలబడి పార్లమెంట్ బిల్లు పాస్ చేయించిన సుష్మా స్వరాజ్ ను తెలంగాణ చిన్నమ్మ అని సంబోధించిన నోటితోనే దూషించిన నీచుడన్నారు బండి సంజయ్.

 bandi
తెలంగాణకు కేసీఆర్ మెయిన్ విలన్ : రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుందన్నారు బండి. సంపూర్ణ మెజారిటీ సాధించడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. సినిమాల్లో గుర్తుండిపోయిన విలన్లు రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య.. రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు మెయిన్ విలన్ రావుగోపాలరావు అయితే కాంగ్రెస్, ఎంఐంఎం పార్టీలు సత్యనారాయణ, అల్లు రామలింగయ్య , కైకాల సత్యనారాయణ వంటి విలన్లుగా అభివర్ణించారు. కమ్యూనిస్టులు ఆకు రౌడీల టైపు అని, వీళ్లంతా కలిసి హీరోలాంటి బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నరన్నారు. హీరోలెక్క ఫైట్ చేస్తూ ప్రజలను కాపాడుకునేందుకు బీజేపీ పోరాడుతోందని, ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీని ఏమీ చేయలేరనే విషయాన్ని ప్రజలకు కూడా అర్ధమైందన్నారు బండి సంజయ్ కుమార్.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+