వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో ఆంధ్రా పెత్తనం ఏంటి? వైఎస్ షర్మిలపై యుద్ధానికి టీఆర్ఎస్ నాన్ లోకల్ అస్త్రం!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ను ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ పార్టీకి నాన్ లోకల్ ఆయుధంగా మారిందా? తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనం ఏమిటీ అంటూ వైయస్ షర్మిలను టార్గెట్ చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇంత కాలం అయిన తర్వాత కూడా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ నమ్ముతోందా? సెంటిమెంట్ అస్త్రంతో టిఆర్ఎస్ పార్టీ షర్మిలను దెబ్బతీయాలని ప్లాన్ చేస్తుందా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

వైఎస్ షర్మిలను ప్రాంతం పేరుతో టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్

వైఎస్ షర్మిలను ప్రాంతం పేరుతో టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టి, ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించిన వైయస్ షర్మిల పాదయాత్రలో చోటుచేసుకున్న దాడి ఘటన, ఆపై షర్మిల అరెస్ట్ ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇదే సమయంలో వైఎస్ షర్మిలను ఆంధ్ర పేరుతో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిలకు పులివెందులలో ఓటు హక్కు ఉందని, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల పని చేసిందని, సోదరుడు పదవి ఇవ్వకపోవడంతో, ఇప్పుడు తెలంగాణలో షర్మిల తాను తెలంగాణ కోడలినని కొత్త రాగం అందుకుందని టార్గెట్ చేస్తున్నారు.

 స్థానికత పేరుతో షర్మిలను టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత

స్థానికత పేరుతో షర్మిలను టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత

ముఖ్యంగా ఇటీవల కేసీఆర్ కుమార్తె కవిత కూడా ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల స్థానికతను టార్గెట్ చేశారు. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు నేడు తెలంగాణ రూటు .. మీరు కమలం కోవర్టు.. ఆరేంజ్ ప్యారేట్టు అంటూ టార్గెట్ చేసిన కవిత వైఎస్ షర్మిలను పొలిటికల్ టూరిస్ట్ అంటూ విమర్శించారు. ఇక వైయస్ షర్మిల ఈ వ్యవహారంపై డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాను తెలంగాణ కోడలిని, తాను ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నా అని, ఇక్కడి వ్యక్తిని పెళ్లి చేసుకుని కొడుకును కన్నానని, తన గతం తన భవిష్యత్తు మొత్తం తెలంగాణలోనే అని వైయస్ షర్మిల పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు.

వైఎస్ గతంలో తెలంగాణాపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న టీఆర్ఎస్.. షర్మిలపై ఆంధ్రా అస్త్రం

వైఎస్ గతంలో తెలంగాణాపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న టీఆర్ఎస్.. షర్మిలపై ఆంధ్రా అస్త్రం

2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాలంటే వీసాలు తీసుకుని వెళ్లాలా అని తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలను కూడా ఇప్పుడు గుర్తు చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించిన వైయస్ఆర్ బిడ్డ ను తెలంగాణ రాష్ట్రం ఎలా ఆదరిస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైయస్ షర్మిల ను ఆంధ్ర పేరుతో టార్గెట్ చేస్తున్నారు. రాయలసీమ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో సాగనివ్వం అంటూ వైయస్ షర్మిల పైన తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. మొత్తానికి వైయస్ షర్మిల ను టార్గెట్ చేయడానికి ఆంధ్ర అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలలో కూడా వైయస్ షర్మిల పట్ల వ్యతిరేకతను కలిగించటంలో భాగంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటును మరోసారి రాజేస్తున్నారు.

కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా? డిఫెండ్ చేస్తున్న వైఎస్ షర్మిల

కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా? డిఫెండ్ చేస్తున్న వైఎస్ షర్మిల


ఈ క్రమంలో తాజాగా వైయస్ షర్మిల కేటీఆర్ భార్య ఆంధ్రాకు చెందిన వ్యక్తి కాదా అంటూ ప్రశ్నించారు. ఇక అంతే కాదు తన ఓటు హక్కును తాను ఎక్కడైనా వినియోగించుకోవచ్చని, ఓటుహక్కు విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదని వైయస్ షర్మిల పేర్కొన్నారు. తనను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక, ఆంధ్ర తెలంగాణా అంటూ కొత్త ఆట ఆడుతున్నారని వైయస్ షర్మిల మండిపడ్డారు. వైఎస్ షర్మిల ఈ వ్యవహారాన్ని దీటుగా ఎదుర్కొంటారా? లేక తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాన్ని పక్కన పెట్టి డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

English summary
What is Andhra domination in Telangana? TRS party leaders are using non-local weapon to fight against YS Sharmila. With this, YS Sharmila has to defend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X