సమాజానికి ఏం మెస్సేజ్ ఇస్తున్నట్టు?గాడి తప్పుతున్నటీవి చర్చలు.!లోపం గెస్టులదా?హోస్టుదా?

హైదరాబాద్ : సమాజానికి ఓ వినూత్న సందేశం ఇవ్వాల్సిన టీవీ కార్యక్రమాలు రచ్చరచ్చగా మారుతున్నాయి. సందేశం ఇవ్వాల్సిన కార్యక్రమం కోపం, ప్రతీకారం, దూషణల పర్వం వరకూ దారి తీస్తున్నాయి. దీంతో టీవీ చూసే ప్రేక్షకులు అసహనానికి గురికావల్సి వస్తోంది. కొన్ని సందర్బాల్లో కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన యాంకర్లు అవగాహనా రాహిత్యంతో అబాసుపాలవుతుంటారు. కార్యక్రమాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లలేక స్టూడియోకి ఆహ్వానించిన అథిధుల మద్య వివాదాలకు కారణమవుతుంటారు. ఒక్కోసారి యాంకర్ కు అథిధికి మద్య మాటలయుద్దం చోటుచేసుకుంటుంది. తాజాగా టీవి9 లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

వివాదాల్లో చర్చా కార్యక్రమం.. ఇరువైపులా తప్పుందటున్న విశ్లేషకులు

వివాదాల్లో చర్చా కార్యక్రమం.. ఇరువైపులా తప్పుందటున్న విశ్లేషకులు

వర్థమాన నటుడు విశ్వ‌క్ సేన్ ఊహించని వివాదంలో ఇరుక్కున్నాడు. తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 యాంకర్ దేవితో జ‌రిగిన‌ ప్రత్యక్షప్రసార చర్చా కార్యక్రమంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ప్రాంక్ వీడియో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈనేపథ్యంలో ఏర్పాటు చేసిన డిబేట్ కోసం టీవీ9 విశ్వక్ ను స్టూడియోకి ఆహ్వానించారు. ఆ స‌మయంలో జ‌రిగిన చ‌ర్చ‌లో యాంకర్ దేవి, విశ్వక్ సేన్ ను పాగల్ సేన్ అని, అతను నిరాశా నిస్పృహల మద్య కొట్టుమిట్టాడే వ్యక్తిత్వం గలవాడని వ్యాఖ్యానించింది.

గాడి తప్పుతున్న చర్చా కార్యక్రమాలు.. నియంత్రణ లేని యాంకర్లు, గెస్టులు

గాడి తప్పుతున్న చర్చా కార్యక్రమాలు.. నియంత్రణ లేని యాంకర్లు, గెస్టులు

దీంతో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని విశ్వ‌క్ సేన్‌ యాంకర్ దేవిని మందలించాడు. సరగ్గా టీవి చర్చ ఇక్కడే అదుపు తప్పింది. సాఫీగా, ఎంటర్టెయిన్ మెంట్ తో సాగాల్సిన చర్చ ఒక్కసారిగా గాడి తప్పింది. దేవి వ్యవహారంపై విశ్వక్ సేన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దేవి కూడా విశ్వ‌క్ సేన్‌పై నోరు పారేసుకుంది. ఈ క్ర‌మంలో తనను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడినందుకు టీవీ9 యాంకర్ దేవిపై పరువు నష్టం దావా వేయాలని విశ్వక్ సేన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇస్తున్నట్టు.. ఇంగ్లీష్ లో తిడితే బూతు కాదా.?

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇస్తున్నట్టు.. ఇంగ్లీష్ లో తిడితే బూతు కాదా.?

అంతే కాకుండా దేవీపై పరువు నష్టం కేసు నమోదు చేయడానికి విశ్వక్ సేన్ లీగల్ టీమ్ రెడీ ఐనట్లు తెలుస్తోంది. ఇక త‌న‌ను అవ‌మానించారంటూ విశ్వక్ సేన్ అభ్యంతరకరమైన ఇంగ్లీష్ బూతు పదాన్ని ఉపయోగించడంపై దేవీ అభిమానుల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదే వ్యవహారం పట్ల టీవి విశ్లేషకుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే వివాదాస్పద టీవి చర్చ అంశంలో రాజకీయ జోక్యం కూడా చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు స్పందిస్తూ విశ్వక్ సేన్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

యాంకర్ కు సమగ్ర అవగాహన ఉండాలి.. మనోభావాలను గౌరవించకపోతే ఇలాగే ఉంటుందంటున్న విశ్లేషకులు

యాంకర్ కు సమగ్ర అవగాహన ఉండాలి.. మనోభావాలను గౌరవించకపోతే ఇలాగే ఉంటుందంటున్న విశ్లేషకులు

స్టూడియోలో చర్చకోసం ఆహ్వానించి అవమానకరంగా వ్యవహరించడం ఎంతరకు సమంజసమని దేవీ వ్యవహారంపై కొంతమంది ప్రముఖలు పెదవి విరుస్తున్నారు. సందేశంతో కూడుకున్న ఆరోగ్యవంతమైన చర్చలు నిర్వహించాలిగాని, ఇలాంటి చౌకబారు అంశాలను ఎంచుకుని అబాసుపాలవ్వడం ఎందుకనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. టీవిల్లో చర్చలకోసం గెస్టులు వచ్చేంత వరకూ అనేక ఫోన్లు చేసి వచ్చిన తర్వాత ఇలా అవమానించడం సరికాదంటున్నారు మరికొంతమంది విశ్లషకులు. ఏది ఏమైనా సాఫీగా సాగాల్సిన టీవీ చర్చా కారక్రమాలు ఇలా విద్వేషపూరితంగా ముందుకువెళ్లడం అంత ఆరోగ్యకరమైన వాతావరణం కాదనే వాదన తెరమీదకు వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+