కేంద్రంపై యుద్దం ఏమైంది.!ధాన్యం కొనుగోలు ఎటువెళ్లింది.!కేసీఆర్ ను నిలదీసిన సీఎల్పీ నేత భట్టి.!
హైదరాబాద్ : ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తామని పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి వచ్చి పది రోజులు గడుస్తున్నా టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై ఎందుకు యుద్ధం చేయడం లేదని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తాటతీస్తాం.. మెడలు వంచుతామని ప్రగల్బాలు పలికిన ఎంపీలు హైదరాబాద్ వచ్చాక మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. పార్లమెంటు సమావేశాలు బహిష్కరించి వచ్చి రైతులతో కలిసి రాస్తారోకోలు, ధర్నాలు, రైతు దీక్షలు, రైతు కల్లాల వద్ద ఆందోళన చేస్తారని ఆశించగా అందుకు భిన్నంగా ఉండటంపై తీవ్రంగా తప్పు పట్టారు బట్టి విక్రమార్క.

ధాన్యం కొనుగోలులో బీజేపి టీఆర్ఎస్ డ్రామాలు.. ఓట్లేసిన జనాలను ఫూల్స్ చేస్తున్నారని భట్టి ఫైర్
కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పార్లమెంటు సమావేశాల్లో ప్రతిరోజూ ఆందోళన చేయాల్సిన టీఆర్ఎస్ ఎంపీలు సమావేశాలను బహిష్కరించి బాధ్యతారహితంగా వ్యవహరించారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంటులో కేంద్రంపై కొట్లాడక, రైతులతో కలిసి బయట పోరాటం చేయకుండా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మాత్రం పిచ్చివాల్ల కింద జమకట్టారని మండిపడ్డారు. నవంబర్ 29 నుంచి ప్రారంభమైన శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేవలం వారం రోజుల పాటు మొక్కుబడిగా ఆందోళనల పేరిట పార్లమెంట్ హౌజ్ లో టీఆర్ఎస్ ఎంపీలు టైంపాస్ చేశారని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారం కావాలని, రైతులు ఆనందంగా ఉండాలని టీఆర్ఎస్ ఎంపీల్లో నిజాయితీ ఉండి ఉంటే ఈ నెల 23న పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకూ హౌస్ లోనే ఉండి వివిధ రూపాల్లో ఆందోళనలు చేసేవారన్నారు భట్టి.

పార్లమెంట్ లో మోదీ సర్కార్ కు భంగం కలగకుండా వ్యవహరించారు.. టీఆర్ఎస్ ఎంపీలపై భట్టి ఫైర్
దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఆందోళన చేయాలన్న చిత్తశుద్ధి సీఎం చంద్రశేఖర్ రావుకు, టిఆర్ఎస్ ఎంపీలకు లేదని, ప్రధాని మోడీ ఆగ్రహానికి గురి కాకుండా ఉండటం కోసమే పార్లమెంటు సమావేశాలను సీఎం చంద్రశేఖర్ రావు, టిఆర్ఎస్ ఎంపీలతో బహిష్కరణ చేయించారని ఆరోపించారు. ఢిల్లీలో తెలంగాణ ఎంపీలతో ధర్నా చేయిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రశేఖర్ రావు ఎంపీలను తిరిగి ఎందుకు హైదరాబాద్‌కు రప్పించాడని ప్రశ్నించారు.ధాన్యం కొనుగోలు పై స్పష్టత రాకుండానే పార్లమెంటును బహష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారంటేనే తెరవెనుక టిఆర్ఎస్ బిజెపిల మధ్య ఏదో ఒప్పందం జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయాలు చేస్తూ రైతుల ప్రాణాలను హరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి.

బంగారు తెలంగాణ చేయలేదు కానీ.. కేసీఆర్ ఆత్మహత్యల తెలంగాణ చేసాడన్న భట్టి
70 రోజుల్లో 206 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు భట్టి. బంగారు తెలంగాణ చేస్తానన్న చంద్రశేఖర్ రావు ఆత్మహత్యల తెలంగాణగా మార్చుతున్నాడని ధ్వజమెత్తారు. వానాకాలంలో సాగైన సుమారు 62లక్షల ఎకరాల్లో వరి దిగుబడి కోటి 3 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి రైతులను మూడు నెలలుగా అరిగోస పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ సర్కార్ చేసిన ధాన్యం కొనుగోలు జాప్యం వల్ల బెంగ పడిన రైతులు సిద్దిపేట, ఏటూరునాగారం, కామారెడ్డి జిల్లాలో ధాన్యం కుప్పల వద్ద గుండె పగిలి చనిపోయారని చంద్రశేఖర్ రావు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంతో సంబంధం లేకుండా ధాన్యం కొనాలి... టీ సర్కార్ కు భట్టి డిమాండ్
ఇంకా ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా 20 శాతం వరి కోతలు మిగిలి ఉన్నాయని, మరో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి ముందే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి 1982 కొనుగోలు కేంద్రాలను మూసి వేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. వానాకాలం పంటను చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తానని ప్రకటించిన సీఎం చంద్రవేఖర్ రావు తన మాటను నిలుపుకోవాలని, లేనిపక్షంలో రైతులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

పంటపై లోన్లు రావు.. అప్పుతీర్చలేక రైతులు ఆత్వహత్యలు..
రాష్ట్రవ్యాప్తంగా 40.66లక్షల రైతులకు సంబంధించి 25,936 కోట్ల రైపాయల క్రాఫ్ లోన్స్ ఉండగా, గడిచిన మూడేండ్లలో కేవలం 4 లక్షల మంది రైతులకు సంబంధించి 732.24 కోట్లు రైపాయలు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఇంకా 36.66 లక్షల మంది రైతులకు సంబంధించి 25,203 కోట్ల రూపాయలను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకుల్లో కొత్త అప్పు పుట్టక, అధిక మిత్తికీ ప్రైవేటు వ్యాపారుల వద్ద తెచ్చుకుని తిరిగి తీర్చలేక మనస్తాపంతో రైతులు ప్రాణాలు వదులుతున్న ఘటనలకు సీఎం చంద్రశేఖర్ రావు బాధ్యత వహించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications