వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ ఉద్యోగాలు ఎక్కడపోయినయ్.!బండి సంజయ్ కు లోక్ సభలో ప్రశ్నించే దమ్ముందా?హరీష్ ఫైర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఉద్యోగాల విషయంలో బండి సంజయ్ పార్లమెంటులో నిలదీయాలని సవాల్ విసిరారు. ముందుగా ప్రకటించిన 16.5 లక్షల ఉద్యోగాలు యువతకు దక్కేలా చేయాలని నిలదీసారు. ఏం ముఖం పెట్టుకొని గ్రామాల్లో తిరుగుతారని హరీష్ తెలంగాణ బీజేపిని ప్రశ్నించారు.

ఉద్యోగాలు ఇస్తున్నది తెలంగాణ అయితే...ఉన్నవి ఊడగొడితున్నది బీజెపీ అని, యువత కోసం బిజెపి ఏం చేసిందని, బీజేపి వాళ్ల మాటలు కోటలు దాటుతాయి కానీ ఒక్కటి కూడా క్షేత్ర స్ధాయిలో జరగదని మండిపడ్డారు. కేంద్ర బీజేపి ప్రభుత్వం 50 వేల మంది ఉద్యోగాలు తొలగించారని, యువత ఈ దిశగా అలోచించాలన్నారు హరీష్ రావు. ఇవే ఉద్యోగాల అంశంలో పార్లమెంట్ లో మోదీని నిలదీసే ధైర్యం ఉందా అని నిలదీసారు.

Where have Modi jobs gone?Does Bandi have the guts to question in the Lok Sabha?Harish Fire!

అంతే కాకుండా కేంద్రంలో 3 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, ఆర్మ్డ్ రిజర్వ్ లో 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, అవి భర్తీ చేస్తే తెలంగాణ యువతకు కొందరికైనా ఉద్యోగాలు వస్తాయన్నారు హరీష్ రావు. మిలటరీలో చేరాలనే యువత ఆశల మీద బీజేపి నీళ్లు చల్లిందన్నారు. అగ్నిపథ్ పేరిట యువత జీవితాలతో కేంద్రం ఆటలాడుతున్నదని, యువత శక్తిని నిర్వీర్యం చేస్తున్నదని కేంద్ర బీజేపి పైన దుమ్మెత్తిపోసారు మంత్రి హరీష్ రావు. కులం, మతం పేరిట చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనే యోచన తప్ప మరొక అంశం బీజేపీ వద్ద లేదన్నారు.

ఎమోషన్స్ తో రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని సీఎం చంద్రశేఖర్ రావు 95శాతం రిజర్వేషన్ కల్పించారని, తెలంగాణ రాష్ట్రంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడు 91 వేల ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

English summary
Medical and Health Minister Harish Rao lashed out at Telangana BJP President Bandi Sanjay Kumar. In the matter of jobs, Bandi Sanjay challenged to stand in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X