కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థులు ఎవరో చెప్పాలి.!ప్రతిపక్ష పార్టీలను నిలదీసిన కల్వకుంట్ల కవిత.!

హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సీఎం అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని, మరి కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థులు ఎవరో చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిపక్ష పార్టీలను నిలదీసారు. వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ కావాలా? లేదా 24 గంటల నిరంతర విద్యుత్తు అందిస్తున్న సీఎం చంద్రశేఖర్ రావు కావాలా? అన్నది రైతులు ఆలోచించుకోవాలని కవిత కోరారు.

మూడు గంటల విద్యుత్ సరిపోతుందా : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్ల పెట్టమంటున్నదని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు 15 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం రైతు రుణమాఫీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి కేవలం మూడు గంటల విద్యుత్తు సరిపోతుందని అంటున్నారని ఆమె ధ్వజమెత్తుతూ మూడు గంటల కరెంట్ సరిపోతుందా అని ప్రశ్నించారు.

Who are the CM candidates of Congress and BJP? Kavitha Demands the opposition parties.

కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి ఎవరు : కాంగ్రెస్ వాళ్లేమో మూడు గంటల కరెంట్ చాలంటే..బీజేపీ వాళ్లేమో మోటార్లకు మీటర్లను పెట్టమంటున్నారని విమర్శించారు. బీజేపీ మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొస్తే వాటిపై జరిగిన పోరాటంలో 850 మంది రైతులు మరణిస్తే వాటిని వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మనకు దోస్తులు కాదని, ప్రజలతో కొనసాగే ఒకే ఒక వ్యక్తి సీఎం చంద్రశేఖర్ రావు అని కల్వకుంట్ల కవిత పురుద్ఘాటించారు.

Who are the CM candidates of Congress and BJP? Kavitha Demands the opposition parties.

బీజేపి ని నమ్మొద్దు : రైతుల పక్షాన పోరాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ అని తేల్చిచెప్పారు కవిత. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 100కు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మరొక్కసారి సీఎం చంద్రశేఖర్ రావును ఆశీర్వదించాలని రాష్ట్ర రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. తాగునీటి కోసం 160 కోట్ల రూపాయలను ఆర్మూర్ కు సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటించారని తెలిపారు. రైతుల పక్షాన నిలబడ్డ చంద్రశేఖర్ రావు కావాలా..లేదా ఇతర పార్టీలు కావాలా అన్నది రైతులు ఆలోచించాలని కవిత కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+