జీఈఎస్2017: ఇవాంకా నోట మన రాజ్‌లక్ష్మి పేరు, ఎవరీమె?
హైద్రాబాద్‌లో జీఈఎస్ 2017 సదస్సు ప్రారంభోత్సవ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఉపన్యాసంలో ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించారు. వారిని ప్రతినిధులందరికీ పరిచయం చేయించారు.
హైదరాబాద్: హైద్రాబాద్‌లో జీఈఎస్ 2017 సదస్సు ప్రారంభోత్సవ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఉపన్యాసంలో ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించారు. వారిని ప్రతినిధులందరికీ పరిచయం చేయించారు. ఈ ముగ్గురిలో ఇండియాకు చెందిన రాజ్‌లక్ష్మికి చోటు దక్కింది. రాజ్‌లక్ష్మి బెంగుళూరు వాసి.
Recommended Video

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నవంబర్ 28వ, తేదిన హైద్రాబాద్ హెచ్ఐసిసిలో ప్రారంభమైంది. ఈ సదస్సులో ఇవాంకా ట్రంప్ ముగ్గురి మహిళల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించింది.
మహిళల సాధికారిత వల్ల ఏ రకంగా ప్రయోజనం పొందుతారో ఇవాంకా ప్రస్తావించారు. తొలిసారిగా జీఈఎస్ సదస్సులో సుమారు 50 శాతం మహిళా ప్రతినిధులు పాల్గొంటున్న విషయాన్ని కూడ ఆమె ప్రస్తావించారు.

ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించిన ఇవాంకా
జీఈఎస్ 2017 సదస్సు ప్రారంభోత్సవ ఉపన్యాసంలో డొనాల్డ్ ట్రంప్ కూతరు ఇవాంకా ట్రంప్ ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించింది. బెంగళూరుకు చెందిన రాజ్‌లక్ష్మి ,అజర్ బైజాన్‌కు చెందిన రేహాన్, దారా డోట్జ్ అమెరికాలోని శాన్‌ప్రాన్సిస్కోకు చెందినవారు. ఈ ముగ్గురి పేర్లను ఇవాంకా ట్రంప్ ప్రస్తావించారు. వారందరిని పిలిచి ప్రతినిధులకు పరిచయం చేశారు.వారి గురించి పలు విషయాలను ప్రస్తావించారు.

ఎవరీ రాజ్‌లక్ష్మీ
బెంగళూరుకు చెందిన రాజ్‌లక్ష్మి రెండు దశాబ్దాలుగా ఐటీ రంగంలో ఉన్నారు. టెర్రా బ్లూ ఎక్స్‌టీ అనే సంస్థను స్థాపించారు. దానికి ఆమే సీఈవో. క్రానిక్ నరాల జబ్బులు, జీవనశైలి జబ్బులను గుర్తించడానికి, వాటి చికిత్సకు వీలుగా రాజ్‌లక్ష్మి, ఆమె బృందం కలిసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సహకారంతో పనిచేసే పరికరాలను తయారు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన పరికరాలతో ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నారు. మరెంతో మంది మెరుగైన జీవన శైలిని అవలంబించడానికి కారణం అవుతున్నారు.

కొడుకు కోసం రాజ్‌లక్ష్మి
రాజ్‌లక్ష్మి కొడుకుకు చిన్న వయసులోనే సీజర్స్ అనే జబ్బు రావడమే. అతని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఆమె సొంతంగా ఓ పరిష్కారాన్ని కనుక్కోవాలని నిర్ణయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆమె ఓ స్మార్ట్ గ్లోవ్‌ను రూపొందించారు. ఇది వివిధ జబ్బులను గుర్తించడమే కాదు, అవి వచ్చే అవకాశాన్నీ చెబుతుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా తమ ఉత్పత్తులు అందుబాటులో ఉండాలని ఆమె భావిస్తున్నారు.

వర్షపు నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న 15 ఏళ్ళ రేహన్
అజర్ బైజాన్‌కు చెందిన రేహాన్‌కు 15 ఏళ్లు. అంత చిన్న వయసులోనే, ‘ప్రతి ఇంటినీ వెలిగించాలి' అనే నినాదంతో ఆమె ఓ స్టార్టప్ కంపెనీని స్థాపించారు. వాననీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడమే ఈ కంపెనీ ఉద్దేశ్యం. . క్యూబాలో పుట్టిన రేహాన్ ప్రస్తుతం బాకూలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఈ ఏడాది మేలో, యూరప్‌లో జరిగిన న్యూ ఐడియా కాంపిటీషన్, క్లైమేట్ లాంచ్‌పాడ్ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో పాల్గొంటున్న మహిళా ప్రతినిధుల్లో రేహన్ చిన్నవయస్సుంది. రెండు పోటీల్లోనూ ఆమె ఫైనల్స్‌కు చేరారు. ఆగస్టులో ‘ఆడియన్స్ ఫేవరెట్ స్టార్టప్' అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె వాననీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

దారా డోట్జ్ పేదలకు సహయం
శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన దారా డోట్జ్ ... త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ రంగంలో ఉన్నారు. దశాబ్ద కాలం పాటు పేదల కోసం పని చేశారు. ముఖ్యంగా హైతీ భూకంపం అనంతరం ఆమె చేసిన సాయం అంతర్జాతీయ గుర్తింపు సంపాదించింది. త్రీడీ ప్రింటింగ్ ద్వారా భూకంప బాధితుల అనేక సమస్యలకు పరిష్కారాలు కనుక్కొన్నారు. టెడెక్స్ లాంటి వేదికల మీద ఆమె విపత్తు నిర్వహణలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ పాత్ర గురించి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడ విపత్తు సంభవించినా ఆమె కంపెనీ ఫీల్డ్ రడీకి పిలుపు వస్తుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications