వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్ల్యూహెచ్ఓ నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెంప దెబ్బ.!వాస్తవ కోవిడ్ మరణాలను వెల్లడించాలన్న దాసోజు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భారతదేశంలో కోవిడ్ మరణాలు దాదాపు 40 లక్షలు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)నివేదిక భారత ప్రభుత్వానికి గట్టి చెంపదెబ్బ అని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు మండిపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క పద్దతిని ప్రశ్నించడం భారత ప్రభుత్వానికి తగదన్నారు. భారత ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కై కోవిడ్ మరణాలను నివేదించిందని, ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క పద్ధతిని ప్రశ్నించడం కేవలం అహంకారం మాత్రమేనని ధ్వజమెత్తారు.

 కోవిడ్ మరణాల వాస్తవ లెక్కలేవి.?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఫైర్

కోవిడ్ మరణాల వాస్తవ లెక్కలేవి.?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఫైర్

అంతే కాకుండా కోవిడ్ మరణాల వాస్తవ గణాంకాలను ప్రకటించాలని గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని దాసోజు శ్రవణ్ గుర్తు చేసారు. అయినా భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. అంతే కాకుండా వాస్తవ కోణాలు వెలుగులోకి వస్తే అబాసుపాలవుతామనే భావనతో కోవిడ్ మరణాల వాస్తవ సంఖ్యలను అణిచివేసేందుకు మరియు తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాలను రూపొందించడంలో వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మొండిగా వ్యవహరించారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.

 తెలంగాణలో లక్షకు పైగా కోవిడ్ మరణాలు.. కేసీఆర్ ప్రభుత్వం గోప్యత పాటిస్తోందన్న దాసోజు శ్రవణ్

తెలంగాణలో లక్షకు పైగా కోవిడ్ మరణాలు.. కేసీఆర్ ప్రభుత్వం గోప్యత పాటిస్తోందన్న దాసోజు శ్రవణ్

తెలంగాణలో కోవిడ్ కారణంగా లక్ష మందికి పైగా మరణించారని, అయితే దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు వాస్తవ మరణాల సంఖ్య 4100 మాత్రమే అని నివేదించిందని వివరించారు దాసోజు శ్రవణ్. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, ప్రాణ రక్షక మందులు అందుబాటులో లేకపోవడంతో లక్షలాది మంది చనిపోయారన్నారు. కోవిడ్ మరణాల వాస్తవ డేటాను అందించడానికి తాను తెలంగాణ ప్రభుత్వానికి అనేక రూపాల్లో విజ్ఞప్తులు చేసానని దాసోజు శ్రవణ్ వివరించారు.

 వాస్తవాలను బయటపెట్టిన డబ్ల్యూహెచ్ఓ.. సిగ్గుతో తల దించుకోవాలన్న దాసోజు

వాస్తవాలను బయటపెట్టిన డబ్ల్యూహెచ్ఓ.. సిగ్గుతో తల దించుకోవాలన్న దాసోజు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో, అపెక్స్ డెత్ ఆడిట్ కమిటీని నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తాను హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని గుర్తు చేసారు. కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని, తెలంగాణ ప్రభుత్వం ప్రజలనే కాకుండా గౌరవ హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ హక్కులు మరియు డబ్ల్యూహెచ్ఓ నిబంధనలను ఉల్లంఘించి, కోవిడ్ మరణాలకు సంబంధించి భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం రెండూ ప్రజలను మోసం చేశాయని ధ్వజమెత్తారు.

 వాస్తవ డేటా ఇవ్వడం నైతిక బాద్యత.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద తప్పుచేసాయన్న శ్రవణ్..

వాస్తవ డేటా ఇవ్వడం నైతిక బాద్యత.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద తప్పుచేసాయన్న శ్రవణ్..


డబ్ల్యూహెచ్ఓ యొక్క ఇటీవలి అన్వేషణల దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీ తరపున తాను మరోసారి భారత ప్రభుత్వానికి మరియు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తమ తప్పును సరిదిద్దుకోవాలని, అసలు వాస్తవ కోవిడ్ మరణాల సంఖ్యను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రభుత్వం మరణాల సంఖ్యను నియంత్రించలేకపోయిందని, అయితే వాస్తవ డేటాను సమర్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం నైతిక బాధ్యత ఉండాలన్నారు శ్రవణ్.

English summary
AICC National Spokesperson Dr Shravan Dasoju said the World Health Organization (WHO) report that Covid deaths in India were nearly 40 lakh was a slap in the face to the Indian government. It is inappropriate for the Government of India to question the conduct of the World Health Organization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X