వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాది సదస్సుకు కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదు.?ఆ కారణం చేతనైతే ప్రజలు క్షమించరన్న పొన్నాల.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సమస్యలపై సమీక్షలు చేయడంతో పాటు, స్థానికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులను కేంద్రానికి నివేధించడంలో దక్షిణ భారత సదస్సు ఒక ప్రత్యేక వేదికగా పరిణమిస్తుంది. సమస్యల నివేదనకు ఇంతకంటే మరో గొప్ప వేదిక దొరుకుతుందా అని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ సమావేశానికి సీఎం చంద్రశేఖర్ రావు ఎందుకు హాజరు కాలేదని ఆయన నిలదీసారు.

గతంలో నివేదించిన అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంతరకు పరిష్కారాలు సూచించింది అనే అంశాలను ప్రధానంగా సమీక్షిస్తారు. తాజా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి వివరించే విధంగా ముందుకు వెళతారు. ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను సీఎం చంద్రశేఖర్ రావు విస్మరించారని పొన్నాల ఆరోపించారు.

 దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు ఏందుకు హాజరు కాలేది..

దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు ఏందుకు హాజరు కాలేది..

తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు అందరూ గమనిస్తూనే ఉన్నారని, ఇది 29వ ప్రాంతీయ సదస్సు అని, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుందని, దక్షిణాది రాష్ట్రాల సమస్యలు కోసం ఒక సమీక్ష సమావేశం నిర్వమించడం, ప్రజల సమస్యలు, ప్రాంతీయ సమస్యలు గతంలో చెప్పిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎలా ఉన్నది అన్నది చర్చించడంతో పాటు, చొరవ చూపని అంశాల పట్ల కేంద్రం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని, రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో చర్చలు, సమీక్షలు, కొనసాగించాల్సిందేనని పొన్నాల స్పష్టం చేసారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత రాష్ట్రాల లెఫ్టినెంట్ గవర్నర్లు సమావేశానికి హాజరయ్యారని, సమస్యల పరిష్కారం ఇష్టం లేకనే చంద్రశేఖర్ రావు ఈ సదస్సుకు హాజరుకానట్టు అర్థం అవుతోందని పొన్నాల సందేహం వ్యక్తం చేసారు.

అనేక సమస్యలకు పరిష్కారం దొరికేది.

అనేక సమస్యలకు పరిష్కారం దొరికేది.

వరి ధాన్యం సమస్య ఉందని, సీఎం చంద్రశేఖర్ రావు చెప్పాల్సిన అంశాలని ఈ వేదిక ద్వారా కేంద్రానికి చెప్పాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని, ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు చంద్రశేఖర్ రావు అని ఘాటుగా విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసమే సమీక్షలు నిర్వహిస్తారని, ఇలాంటి కీలకమైన అవకాశం వినియోగించుకోకుండా ఏం సాధిస్తారని చంద్రశేఖర్ రావును సూటిగా ప్రశ్నించారు. ఈ సమావేశానికి చంద్రశేఖర్ రావు వెళ్లి ఉండి ఉంటే వరి ధాన్యంపై ఇతర రాష్ట్రాలు ఏమంటున్నాయో తెలిసేదని, కానీ తప్పుడు పంట లెక్కలు ప్రొక్యూర్మెంట్ అంశాలకు సంబంధించిన వాస్తవాలు బయటపడతాయని చంద్రశేఖర్ రావు వెళ్లలేదా అని పొన్నాల ధ్వజమెత్తారు.

 అనేక సమస్యలతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతోంది..

అనేక సమస్యలతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతోంది..

టీఆర్ఎస్ నాయకులు బిజెపి ప్రభుత్వంపై ధర్నా చేసినంత మాత్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రశేఖర్ రావు భావిస్తే అది వందకు వంద శాతం పొరపాటేనని పొన్నాల మండి పడ్డారు. ప్రొక్యూర్మెంట్ మీద పూటకో మాట మాట్లాడుతూ గతంలో మొక్కజన్న వేయద్దని, సన్నరకం వడ్లు వద్దని, యాసంగిలో వరి వద్దే వద్దు అంటూ రైతాంగాన్న అయోమయానికి గురి చేస్తుంది చంద్రశేఖర్ రావు కాదా అని ప్రశ్నిచారు.కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిన తర్వాత సదస్సులకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు వెళ్లకుండా ఉండరని, కానీ ఎలాంటి అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని సదస్సుకు వెళ్లకుండా ఉన్నారని పొన్నాల నిలదీసారు.

 నదీజలాల గురించి చర్చించే అవకాశం పోగొట్టుకున్నాం..

నదీజలాల గురించి చర్చించే అవకాశం పోగొట్టుకున్నాం..

నదీ జలాల అంశం పైన కేంద్ర ప్రభుత్వం పెత్తనం తీసుకుని అజమాయిషీ చలాయించే సమయంలో దీనిని నిలువరించడానికి, తెలంగాణ ప్రభుత్వం వాదన వినిపించడానికి ఇది సరైన వేదిక అయ్యేదనే అంశాన్ని చంద్రశేఖర్ రావు విస్మరించారని మండి పడ్డారు. దక్షణాది సదస్సుకు గైర్హాజరు ఐనందుకు తెలంగాణ ప్రజలకు చంద్రశేఖర్ రావు ఏం సమాధానం చెబుతారని పొన్నాల నిలదీసారు.

గత సంవత్సరం ఇదే దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో 26 అంశాల పట్ల చర్చించారని సదస్సు నివేదిక ఇచ్చిందని, గతంలో చెప్పిన అంశాల మీద కేంద్ర ప్రభుత్వ చర్యలు సరైనవా కావా అని వివరించే ఈ అవకాశాన్ని చంద్రశేఖర్ రావు పూర్తిగా విస్మరించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మంట గలిపారని పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు.

Recommended Video

Telangana: Temperature Dips, Rapidly Falling in TS
 రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తకట్టు పెట్టొద్దు..

రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తకట్టు పెట్టొద్దు..

ఇప్పటివరకు పునర్విభజన లోని అంశాలు ఈ రాష్ట్రానికి ఈ ఒక్కటి అందలేదని, అంతే కాకుండా ట్రిబ్యునల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ అలసత్వమే కారణమని కేంద్రం స్పష్టం చేసిందని, దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాద్యత చంద్రశేఖర్ పై ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో పునర్విభజన చట్టంలో నాలుగు వేల మెగావాట్లు విద్యుత్ ప్లాంట్ మంజూరూ చేస్తామని హామీ ఇచ్చి 16 వందల మెగావాట్లు మాత్రమే వస్తుంటే మిగతా 2400 మెగావాట్లు ఇవ్వడం సాద్యం కాదని కేంద్రం చెప్పుకొస్తున్నా ఎందుకు నిలదీయలేకపోతునన్నారని చంద్రశేఖర్ రావును సూటిగా ప్రశ్నించారు పొన్నాల.

రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలసి ప్రధాని దగ్గరకి వెళ్లి నిలదీద్దామంటే చలనం ఉండదని చంద్రశేఖర్ రావుపై ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడతానంటే ప్రజలు క్షమించరని చంద్రశేఖర్ రావును పొన్నా లక్ష్మయ్య హెచ్చరించారు.

English summary
The South India Conference will serve as a special forum for reporting special local situations to the Center. Senior Congress leader Ponnala Lakshmaiah questioned whether there was another great platform for reporting issues. He questioned why CM Chandrasekhar Rao did not attend the meeting, which was of such importance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X