గణేష్ నిమజ్జనానికి ఆంక్షలు ఎందుకు.?హిందువుల ఐఖ్యత కేసీఆర్ కు నచ్చదన్న బండి సంజయ్.!
కరీంనగర్/హైదరాబాద్ : టీఆర్ఎస్ పాలనలో హిందువులు భిక్షమెత్తుకునే దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. హిందువులు జరుపుకునే పండుగలకు ఆంక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులంతా సంఘటితానికి ప్రతీకగా నిలిచే గణేష్ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం లేదన్నారు. హిందువులంతా సంఘటితమైతే తన ఆటలు చెల్లవనే భావనతోనే వినాయకసాగర్ (ట్యాంక్ బండ్) వద్ద గణేష్ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయకుండా హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా చేసే కుట్రకు తెరదీశారని బండి సంజయ్ అన్నారు.

గణేష్ నిమజ్జనంలో ప్రతిష్టంభన..
వినాయక్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాటు చేయకపోవడంతో వీహెచ్ పీ నేతలు దీక్షలు చేయడంతోపాటు బీజేపీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేశామన్నారు. తాను వినాయక్ సాగర్ పర్యటనకు బయలుదేరుతున్నట్లు ప్రకటించిన తరువాతే ప్రభుత్వం దిగొచ్చి ఆదరబాదరాగా వినాయక సాగర్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేశారని అన్నారు. అవి కూడా తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా బండి సంజయ్ గురువారం కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద వినాయక మండపాలను సందర్శించారు.

మంత్రులు సినీ నటులను మరిపించేలా నటిస్తున్నారు..
హైదరాబాద్ లో కొంతమంది మంత్రుల అబద్దాలకు అంతు లేకుండా పోతుందన్నారు బండి సంజయ్. నిన్న ఒక మంత్రి సినిమా యాక్టర్ మాదిరిగా నటిస్తున్నాడని, వినాయక సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయాలని వీహెచ్ పీ దీక్షలు చేసింది. బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేసింది. బీజేపి నేతలు వినాయక సాగర్ కు వస్తున్నామని చెప్పిన తరువాతే ప్రభుత్వం దిగొచ్చిందని, ఆదరబాదరాగా జేసీబీలు పెడుతూ మీడియాకు షో చూపే యత్నం చేసారని అన్నారు. టీఆర్ఎస్ డ్రామాలకు అంతులేకుండా పోయిందని బండి సంజయ్ బండి పడ్డారు.

హడావిడిగా ఏర్పాట్లు..
బుదవారం ఉదయం వరకు ఒక్క క్రేన్, జేసీబీ ఏర్పాటు చేయని ప్రభుత్వం బీజేపి దీక్షలకు దిగి వినాయక్ సాగర్ వస్తున్నానని చెప్పిన తరువాతే హడావుడిగా తూతూ మంత్రంగా జేసీబీలను ఏర్పాటు చేశారని, అది కూడా మట్టి వినాయకులు మాత్రమే ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేస్తామని చెప్పారని గుర్తు చేసారు. ఇప్పుడేమో అన్ని రకాల విగ్రహాలు నిమజ్జనం చేయొచ్చంటున్నరని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని డ్రామాలు చేసినా వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేసి తీరుతామన్నారు బండి సంజయ్.

ట్యాంక్ బండ్ వద్దే నిమజ్జనం..
అంతే కాకుండా టీఆర్ఎస్ పాలనలో హిందువులు భిక్షమెత్తుకునే దుస్థితి ఏర్పడిందన్నారు బండి సంజయ్. అందుకు ప్రతి ఒక్కరూ సద్దికట్టుకుని రావాలని హిందువులందరినీ కోరుతున్నామని, అన్ని పండుగలకు సమీక్ష చేసే సీఎం గణేష్ నిమజ్జనం గురించి ఎందుకు సమీక్ష చేయలేదని విమర్శించారు. హిందువుల పండుగలకు ప్రాధాన్యతను తగ్గించాలని, తద్వారా హిందువులు సంఘటితం కాకుండా చీల్చాలని కుట్ర చేస్తున్నడని సీఎంపై ధ్వజమెత్తారు బండి సంజయ్. సీఎం ఎన్ని కుట్రలు చేసినా ట్యాంక్ బండ్ వద్దే నిమజ్జనం చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేసారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications