జూబ్లీహిల్స్ లో విష్ణు నామినేషన్, తెర వెనుక - అక్కడే అసలు ట్విస్ట్..!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలక పరిణామం. ఈ ఎన్నికలో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్ధులు ప్రచారం ముమ్మరం చేసారు. త్రిముఖ పోటీలో కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయటం సంచలనంగా మారుతోంది. బీఆర్ఎస్ అభ్యర్దిగా సునీత ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసి.. ప్రచారం సాగిస్తున్నారు. కాగా.. ఇక్కడ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఈ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు శక్తి మేర ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే మంత్రులతో పాటుగా.. పార్టీ ముఖ్యులను ప్రచారంలోకి దించింది. ఎలాగైనా గెలిచేలా పట్టుదలతో ఉంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగం చేస్తోంది. ప్రచారంలో పార్టీ కీలక నేతలు బిజీగా ఉన్నారు. ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ ఇక్కడ కలిసి వచ్చే అంశం. సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇక, బీజేపీ తమ అభ్యర్ధి గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కలిసి రావటంతో.. ఈ సారి పట్టు నిరూపించుకుంటామని చెబుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత.. పీజేఆర్ తనయుడు నామినేషన్ సంచలనంగా మారుతోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను పీవీఆర్ అందజేశారు. మాగంటి సునీత ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. అయితే, ఇక్కడ విష్ణు దాఖలు చేసిన నామినేషన్ పైన పార్టీ నేతలు కొత్త వాదన వినిపిస్తున్నారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విష్ణుతో నామినేషన్ వేయించామని..మాగంటి సునీత నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తరువాత విష్ణు నామినేషన్ ఉపసంహరించుకుంటారని చెబుతున్నారు. అయితే, సునీత నామినేషన్ దాఖలు తరువాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ విష్ణుతో నామినేషన్ వేయించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఎన్నికతో పాటుగా నామినేషన్ల వ్యవహారం సైతం ఈ ఉప ఎన్నికలో ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications