Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజగోపాల్ ఓటమికి బీజేపీ నేతలే కారణమా : ఓట్ల లెక్కలు ఏం చెబుతున్నాయి..!!

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. కోమటిరెడ్డి రాజగోపాల్ ఓడిపోయారు. నాలుగో రౌండ్ పూర్తయిన వెంటనే రాజగోపాల్ కు ఫలితం పైన స్పష్టత వచ్చేసింది. ఇక్కడ మునుగోడులో జరిగిన ఎన్నిక టీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా జరగలేదు. టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వర్సస్ రాజగోపాల్ గా జరిగింది. కాంట్రాక్టు కోసమే పార్టీ మారారంటూ కాంగ్రెస్ - టీఆర్ఎస్ రెండు పార్టీలు సింగిల్ స్లోగన్ తో రాజగోపాల్ పైన వ్యతిరేక ప్రచారం చేసాయి. అసలు రాజగోపాల్ ఓటమి పైన పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Why the Komatireddy Raja Gopal defeat in Munugode, Chk here for the reasons

బీజేపీ నేతల అతి విశ్వాసం
రాజగోపాల్ బీజేపీలో చేరాలని చర్చలు ప్రారంభించిన వెంటనే కమలం పార్టీ నేతలు రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేసారు. రాజగోపాల్ సైతం నియోజకవర్గంలో పార్టీ మారితే ఎదురయ్యే పరిస్థితులు..కాంగ్రెస్ పార్టీని వీడుతున్న సమయంలో కలిసొచ్చే నేతల గురించి అతి విశ్వాసంతో ముందుకు వెళ్లారు. ఉప ఎన్నికలకు సిద్దమయ్యే రాజీనామా చేసారు. కేసీఆర్ వ్యూహాలను తక్కువగా అంచనా వేసారు, వెనుక ఉన్న బీజేపీ నేతల బలాన్ని ప్రదానంగా నమ్ముకున్నారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం మునుగోడులో పూర్తిగా రాజగోపాల్ బలం మీదనే విజయం సాధించాలని ప్రయత్నించారు. ఫలితం తరువాత స్పందించిన రాజగోపాల్ నైతికంగా తానే విజయం సాధించానని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఈ స్థాయిలో 90 వేల వరకు ఓట్లు రావటంతో ప్రజల అభిప్రాయం ఏంటో స్పష్టమైందని చెప్పారు.

Why the Komatireddy Raja Gopal defeat in Munugode, Chk here for the reasons

పోల్ మేనేజ్ మెంట్ లో వెనుకంజ
దుబ్బాక..మునుగోడు లో వచ్చిన విజయాలతో బీజేపీ అధినాయకత్వం ఎక్కడ పోటీ చేసినా విజయం ఖాయమనే ధీమాతో వ్యవహరం నడిపింది. కాంగ్రెస్ నుంచి కొందరు నేతలను తనతో తీసుకెళ్లిన రాజగోపాల్.. పార్టీ ఓటింగ్ ను మాత్రం తీసుకెళ్లలేకపోయారు. ఫలితంగా కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు లేదని భావించిన సమయంలో దాదాపు 18 వేల ఓట్లను కాంగ్రెస్ దక్కించుకుంది. ఆ ఓట్లే ఇప్పుడు రాజగోపాల్ ఓడిపోవటానికి ఒక కారణంగా పేర్కొంటున్నారు. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ నేతలు మునుగోడులోనే మొహరించి.. పోల్ మేనేజ్ మెంట్ పైన ఫోకస్ పెడితే..బీజేపీలో పోల్ మేనేజ్ మెంట్ లో వైఫల్యం కనిపించింది. బీజేపీని ఓడించటానికి వామపక్షాలతో సీఎం కేసీఆర్ పొత్తు కట్టారు . ప్రచారం చివర్లో కేసీఆర్ సభ ఏర్పాటు చేసి బీజేపీని టార్గెట్ చేసారు.

Why the Komatireddy Raja Gopal defeat in Munugode, Chk here for the reasons

బీజేపీవి కావు.. రాజగోపాల్ ఓట్లుగా విశ్లేషణ
కానీ, బీజేపీ నుంచి ముఖ్య నేతలు వస్తామని ప్రకటించి రాలేదు. ఇక.. ఈ మాత్రం పోటీ...ఓట్లు వచ్చాయంటే అది రాజగోపాల్ వ్యక్తిగత ఇమేజ్ గా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మునుగోడులో పార్టీ పరంగా బీజేపీ పెద్దగా బలం లేదు. కానీ, బీజేపీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్ టీఆర్ఎస్ మెజార్టీని ఆ పార్టీ నేతలు అంచనా వేసిన దాని కంటే తక్కువగా పరిమితం చేయగలిగారు. కానీ, ఇప్పుడు రాజగోపాల్ సాధించిన ఓట్ల ద్వారా. .రానున్న అసెంబ్లీ ఎన్నికలు ముందు తమకు తిరుగులేదని భావిస్తున్న టీఆర్ఎస్ కు జలక్ ఇవ్వగలిగామని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు బీజేపీ -టీఆర్ఎస్ పార్టీలకు మునుగోడు ఫలితం భవిష్యత్ రాజకీయం పైన ఒక హెచ్చరికగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+