సెల్యూట్ కల్నల్ సంతోష్ బాబు: నాలుగేళ్ల కుమారుడు, భార్య కన్నీటి వీడ్కోలు..
డ్రాగన్ చైనా ముష్కరుల దాడిలో ఆసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబుకు కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. సూర్యాపేట కేసారంలోని సంతోష్ బాబు వ్యవసాయ క్షేత్రంలో ఆర్మీ, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. కరోనా వైరస్ సందర్భంగా కొద్దిమందికే అనుమతి ఇచ్చిన వందలాది మంది అంత్యక్రియలు నిర్వహించే చోటుకు వచ్చి, తుది వీడ్కోలు పలికారు. సంతోష్ తండ్రి చితీకి నిప్పుపెట్టగా.. అతని నాలుగేళ్ల కుమారుడు అనిరుధ్ తల్లితో కలిసి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాడు. ఈ ఘట్టం చూసిన ప్రతీ ఒక్కరు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఆర్మీ మూడు రౌండ్లు కాల్పులు జరిపాక.. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. అయితే సంతోష్ కుమారుడు అనిరుధ్, భార్య సెల్యూట్ చేసి.. వీడ్కోలు పలికారు. కంటినుంచి వస్తోన్న దు:ఖాన్ని ఆపుకొని మరీ.. కన్నీటి వీడ్కోలు తెలిపారు. ఆర్మీ గౌరవ వందనం తర్వాత.. భారత్ మాతా కీ జై అనే నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది. సంతోష్ బాబు అమర్ రహే, వందేమాతరం అంటూ నినాదించారు. అంతకుముందు 6 కిలోమీటర్లు సాగిన అంతిమయాత్రలో ప్రజలు పూలు చల్లారు.
Recommended Video
సంతోష్ బాబుకు గౌరవసూచకంగా గురువారం షాపులను మూసివేశారు. 45 ఏళ్ల తర్వాత తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ వద్ద చైనాకు చెందిన జవాన్లు కల్నల్ సంతోష్ బాబు అండ్ టీమ్‌పై రాళ్లతో దాడిచేశారు. దీంతో 20 మంది జవాన్లు వీరమరణం పొందారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications