మరో మహిళతో భర్త రాసలీలలు: కళ్ళలో కారం కొట్టి; కొడుకు,తండ్రితో కలిసి భార్య ఏంచేసిందంటే!!
భార్యాభర్తలు అంటే ఒకరికొకరు ఆలంబనగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని కొనసాగించాలి. అలా కాకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి భార్యాభర్తల బంధానికి అర్థం లేకుండా చేసిన ఓ భర్త, తన భర్త తప్పు చేస్తున్నాడని మార్చుకోవడానికి ప్రయత్నించక పోగా భర్తను హతమార్చడానికి కొడుకు జీవితాన్ని కూడా బలి చేసిన భార్య తీరుతో కుటుంబమే చిన్నాభిన్నమైంది. జనగామ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం... భార్య ఘర్షణ
తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య దారుణంగా హతమార్చింది. హైదరాబాద్ కు చెందిన వినోద్ జనగామ అంబేద్కర్ నగర్ కు చెందిన మందులతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది .ఈ మధ్యకాలంలో వివేక్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన మంజుల తరచూ భర్తతో గొడవ దిగుతుంది.

భర్తను హతమార్చాలని భార్య ప్లాన్
ఇద్దరి మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ క్రమంలోనే తన కొడుకుతో కలిసి జనగామ లోని తన పుట్టింటికి వచ్చింది మంజుల. తన భర్త తనను కాదని వేరే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న మంజుల ఆగ్రహంతో వివేక్ హతమార్చాలని పక్కా ప్లాన్ వేసింది. ఈ క్రమంలో వివేక్ ను జనగామ కు రప్పించింది. ఇక అక్కడ కూడా వివేక వివాహేతర సంబంధం గురించి మంజుల భర్తతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య, కొడుకు, మంజుల తండ్రి వివేక్ ను హతమార్చాలని నిర్ణయం తీసుకున్నారు.

కొడుకు, తండ్రితో కలిసి భర్తను హతమార్చిన భార్య
ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో అప్పటికే సిద్ధంగా ఉన్న కొడుకు, మంజుల తండ్రి, వినోద్ కంట్లో కారం కొట్టారు. ఆపై వివేక్ తేరుకునే లోపే ఊహించని విధంగా అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. మృతుడి భార్య మంజుల తో పాటు ఆమె కొడుకు, మంజుల తండ్రి కూడా కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు జనగామ పోలీసులు వెల్లడించారు.

ఒకరు తప్పు చేస్తే తప్పుల మీద తప్పులు చేసి కుటుంబమే చిన్నాభిన్నం
ఇదిలా ఉంటే పెళ్లి చేసుకుని కలకాలం తనతో కలిసి జీవిస్తానని మాటిచ్చిన వివేక్ భార్య పిల్లలను కాదని వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తప్పు. ఇక భర్త వివాహేతర సంబంధం గురించి తెలిసిన భార్య భర్తను మార్చుకునే ప్రయత్నం చేయకపోగా, అతడ్ని హతమార్చడం ఇంకో తప్పు. భర్తను చంపడం కోసం కన్న కొడుకు జీవితాన్ని ఫణంగా పెట్టడం మరో తప్పు.
అంతేకాదు మంజుల తన తండ్రిని కూడా ఈ హత్యలో ఇన్వాల్వ్ చేయడం కూడా తప్పే. మొత్తంగా ఈ కేసులో భర్త ఒక తప్పు చేస్తే, భార్య భర్తను హతమార్చడానికి తనతో పాటు మరో ఇద్దరు జీవితాలను బలి చేసింది. మొత్తంగా ఆ కుటుంబం ఈ హత్యతో జైలు పాలైంది.












Click it and Unblock the Notifications