భర్తకు మగతనం లేదంటూ భార్య గొడవ, భర్త ఏం చేశాడంటే...
భర్తకు లైంగిక సామర్థ్యం లేదంటూ భార్య పంచాయతీ పెట్టడంతో వారి దాంపత్యంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భర్త ఉన్మాదిగా మారాడు. అసలు భార్యే లేకుంటే ఏ గొడవా ఉండదని, ఆమెను గొడ్డలితో నరికి చంపాడు.
సిద్దిపేట: భర్తకు లైంగిక సామర్థ్యం లేకపోవడంతో దాంపత్యంలో గొడవలు మొదలయ్యాయి. పెద్దలు పంచాయితీ నిర్వహించారు. మందులు వాడితే అతడికి నయమవుతుందని ఆమెకు నచ్చజెప్పి భర్తవద్దే ఉంచారు.
అయినా ఆ భార్యాభర్తల మధ్య గొడవలు ఆగలేదు. ఈ క్రమంలో భర్త ఉన్మాదిగా మారాడు. అసలు భార్యే లేకుంటే ఏ గొడవా ఉండదని, ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. పెళ్లయిన మూడు నెలలకే ఈ ఘోరం జరగడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్‌చెర్వు తండాల్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుందీ ఘటన. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గత ఏప్రిల్ నెలాఖరులో గోదావరిఖనికి చెందిన గుగులోతు తిరోజ (21)ను అక్కన్నపేట మండలం మల్‌చెర్వు తండాకు చెందిన గుగులోతు రఘుకు ఇచ్చి పెళ్లి చేశారు. రఘుతో దాంపత్య జీవితం సాగడం లేదని తిరోజ ఆమె తల్లి దండ్రులకు తెలిపింది.
పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించి సర్దిచెప్పారు. అయినా రఘు ప్రవర్తనలో మార్పు రాలేదు. సరికదా.. కాపురం చేయడం లేదంటూ తన పరువు తీస్తుందని భార్యపై కక్షపెంచుకున్నాడు.
మంగళవారం ఎవరూ లేని సమయం చూసి తిరోజను గొడ్డలితో నరికేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సాయంత్రం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఎస్‌ఐ పాపయ్యనాయక్, మోతిరాంనాయక్‌లు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వారు రాగానే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు. నిందితుడు రఘు పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications