ఆగ్రహంతో భర్త మర్మాంగాలు కోసేసిన భార్య
హైదరాబాద్: భర్త ఎన్ని బాధలు పెట్టినా ఎంతో సహనంతో భరిస్తూ వచ్చిన ఓ మహిళ ఏ మాత్రం సహించలేకపోయింది. వేధింపుల నుంచి విముక్తి పొందాలనుకుంది. ఎన్నోసార్లు మంచిగా చెప్పి చూసింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో సహనం కోల్పోయిన ఆమె భర్త మర్మాంగాలను కోసేసింది. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లోని అంబేద్కర్‌నగరలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎసిబికి చిక్కిన హెడ్ కానిస్టేబుల్
లంచం తీసుకుంటూ ఓ హెడ్‌కానిస్టేబుల్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాదులోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జనార్దన్ ఒకరి నుంచి రూ.4500 లంచం తీసుకుంటుండగా వలపన్నిన ఏసీబీ అధికారులు జనార్దన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర బోయపల్లికి చెందిన మహిళ అంజమ్మ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.
మహిళ ఆత్మహత్యాయత్నం
హైదరాబాదులోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. ఇది గమనించిన లేక్ వ్యూ పోలీసులు ఆమెను రక్షించారు. అంతరం ఆమెను లేక్ వ్యూ పోలీసు స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇప్పించారు.












Click it and Unblock the Notifications