దారుణం: ఉద్యోగం, ఇన్సురెన్స్ డబ్బు కోసం డ్రైవర్ సాయంతో భర్తను చంపింది
హైదరాబాద్: వనస్థలిపురంలో దారుణం జరిగింది. ఓ భార్య.. భర్తను హత్య చేసింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త చనిపోతే అతని ఉద్యోగం, ఇన్సురెన్స్ సొమ్ము తనకు వస్తుందని ఈ ఘోరానికి పాల్పడింది. మృతుడిని కేస్య నాయక్‌గా గుర్తించారు. కేస్య నాయక్‌ను కారులో ఊపిరి ఆడకుండా చేసి భార్య పద్మ చంపేసింది.
కారుతో ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించారు. భర్త కేస్యను చంపేందుకు భార్య పద్మకు వినోద్ అనే వ్యక్తి సహకరించాడు. అతను కారు డ్రైవర్. ఈ హత్య రెండు రోజుల క్రితం జరిగింది. తొలుత దీనిని ప్రమాదంగా భావించారు. కానీ దర్యాఫ్తులో దీనిని హత్యగా తేల్చారు పోలీసులు. పోలీసులు హత్యకు పాల్పడిన పద్మ, వినోద్‌లను అరెస్టు చేశారు.

రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి మోసం చేశాడు. దీనిపై నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లేష్ కూతురు, కొడుకు చదువులు పూర్తి చేసి, ఉద్యోగం వెతుకులాటలో ఉన్నారు. ఆ సమయంలో బాలిరెడ్డి అనే వ్యక్తి వారికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ముంచాడు.
తనకు రైల్వే అధికారులతో పరిచయం ఉందని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఆయనను నమ్మి రూ.7 లక్షలు ఆయన చేతిలో పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాలేదు. డబ్బు అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications