అక్రమ సంబంధమని రెండో భార్యపై అనుమానం: భర్తను చంపేసింది
కరీంనగర్: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో నిత్యం తనను వేధిస్తున్నాడని కరీంనగర్ జిల్లా పాతగూడూరు గ్రామంలో గురువారం రాత్రి ఓ భార్య తన భర్తను బండరాయితో కొట్టి హతమార్చింది. పెద్దపల్లి సీఐ ప్రశాంత్‌రెడ్డి, వెల్గటూరు ఎస్‌ఐ అంజయ్య అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కరీంనగర్ జిల్లాలోని పాతగూడూరు గ్రామానికి చెందిన మల్లవేని గట్టయ్య అలియాస్ గణపతి (60) మాజీ మావోయిస్టు. అతడికి శంకరమ్మ, అంజలి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య అయిన అంజలి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కొద్ది రోజులుగా గట్టయ్య వేధిస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి గట్టయ్య అంజలితో గొడవపడ్డాడు. ఆమెను ఇంట్లో నుంచి బయటికి తీసుకువచ్చి తలపై బండతో కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు కింద పడగా, ఇదే అదనుగా భావించిన అంజలి అక్కడే బండరాయితో గట్టయ్య తలపై కొట్టింది. దీంతో అక్కడే ప్రాణాలు విడిచాడు.
అయితే వీరిద్దరూ 1992 లో అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు పొనుగోటి కొండాల్ రావు, వెంకట్‌ర్రావును హత్య చేసి మల్యాల దళంలో చేరారనీ, అనంతరం ఖమ్మం జిల్లా మణుగూరు దళంలో పని చేసి 1994లో పోలీసులకు లొంగిపోయి రూ.లక్ష రివార్డును పొందినట్లు సీఐ, ఎస్‌ఐ వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications