ప్రియుడితో కలిపి పాస్టర్‌ను చంపిన భార్య, హైద్రాబాద్‌లో కార్డాన్ సెర్చ్

మెదక్: పాస్టర్‌ను హత్య చేసి చర్చిలోనే పూడ్చిపెట్టిన సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం పోతులబొగుడ గ్రామంలో ఆదివారం నాడు వెలుగు చూసింది. పాస్టర్‌ను అతని భార్యనే... ప్రియుడితో కలిసి హత్య చేసింది.

పోతులబొగుడకు చెందిన నర్సింలు భార్యతో కలిసి కొన్నేళ్లుగా స్థానికంగా చర్చి నడుపుతూ పాస్టర్‌గా కొనసాగుతున్నాడు. గత మూడేళ్లుగా భార్య తన బంధువైన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో నర్సింహులును అడ్డు తొలగించుకోవాలని ఆయన భార్య సుశీల, ప్రియుడు కుమార్ భావించారు.

ఇందుకు పథకం వేశారు. 15 రోజుల క్రితం చర్చిలో ప్రార్థన చేస్తున్న సమయంలో నర్సింలు తల పైన దుప్పటి కప్పి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా చర్చిలోనే గుంత తీసి పూడ్చి పెట్టి సిమెంటుతో ఫ్లోరింగ్ చేశారు. పాస్టర్ గురించి వాకబు చేసిన వారికి భార్య పొంతన లేని సమాధానాలు చెప్పింది.

Wife kills pastor with the help of lover

మరోవైపు, కుమార్ ఇక్కడే తిష్ట వేసి ఉన్నాడు. దీంతో, బంధువులకు అనుమానం వచ్చి శనివారం అల్లాదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నర్సింలు భార్య సుశీల, ప్రియుడు కుమార్‌ను విచారించారు. దీంతో, వారు తమ నేరాన్ని అంగీకరించారు. ఎలా హత్య చేశారో చెప్పారు.

హైదరాబాద్‌ పాతబస్తీలో పోలీసుల నిర్బంధ సోదాలు

హైదరాబాద్‌ పాతబస్తీలోని దక్షిణ మండల పరిధిలో నాలుగు చోట్ల ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పోలీసులు నిర్బంధ సోదాలు నిర్వహించారు. ఉన్నతాధికారుల నేతృత్వంలో పోలీసులు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.

నగరంలో రెచ్చిపోతున్న బిహార్‌, పశ్చిమ బంగా రాష్ట్రాలకు చెందిన గొలుసు దొంగలే లక్ష్యంగా పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అరవై మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 35 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు, బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఫలక్‌నుమా పరిధి మహ్మద్‌నగర్‌, మీర్‌సాబ్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి.

కుమారుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ఖమ్మం జిల్లా మధిర పట్టణం ఎస్సీ కాలనీలో దారుణం జరిగింది. ఓ మహిళ తన కుమారుడితో కలిసి భర్తను రోకలి బండతో కొట్టి దారుణంగా హతమార్చింది. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా తెలుస్తోంది.

చెరకు రైతు మృతి

తరలించిన చెరుకుకు ఫ్యాక్టరీ యాజమాన్యం యేడాదిగా బిల్లులు చెల్లించకపోవడం, సాగుకు రూ.2లక్షల వరకు అప్పు చేయడం, వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంట దిగుబడి తగ్గుతుందన్న దిగులుతో ఓ రైతన్న గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.

జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్‌కు చెందిన సదరు రైతు పొలం వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. వారసత్వంగా ఉన్న మూడెకరాల సొంత భూమితో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని చెరుకు పంటను సాగు చేస్తున్నాడు.

గత యేడాది ఓ పరిశ్రమకు 120టన్నుల చెరుకును తరలించగా... రావాల్సిన రూ.3 లక్షల బిల్లులు నేటికి యాజమాన్యం చెల్లించలేదన్నారు. దీనికి తోడు సాగుకు చేసిన అప్పులు రూ.2 లక్షలు, బ్యాంకులో రూ.50వేలు అప్పు ఉండడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం పంట పొలానికి వెళ్లిన అతను అక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+