మద్యానికి బానిసైన భర్త కళ్లల్లో కారంపోడి... అనంతరం హత్య చేసిన భార్య
భర్తలు, భార్యలను చిత్రహింసలకు గురి చేయడం, ఇతర చెడు అలవాట్లకు బానిస అవడం లాంటీ కారణాలు ఎవి ఉన్నా భార్యలకు ఒపిక ఉన్నంతవరకే మగవాళ్ల ఆటలు కొనసాగుతాయి. వాళ్లలో ఒపిక, సహనం చచ్చిపోతే మాత్రం భద్రకాళీలా మారి భర్తలనే దారుణంగా చంపేసే పరిస్థితి ఉంటుంది. ఇలా భార్య కోపానికి బలైన ఓ భర్త తనువు చాలించాడు.
భర్త మద్యానికి బానిస కావడంతో భార్య దారుణంగా చంపివేసింది. భర్త కళ్లల్లో కారంపోడి చల్లి అనంతరం కత్తితో పోడిచింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ దారుణం చోటుచేసుకుంది. జవహర్ నగర్ కాలనీకి చెందిన కొయ్యడ చంద్రయ్య, భాగ్యమ్మ భార్య భర్తలు. చంద్రయ్య సింగరేణి కాలరీస్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఐతే మద్యానికి బానిసైన చంద్రయ్య నిత్యం భార్యను వేధించేవాడు. అంతేకాదు ఆమెను అనుమానిస్తూ చిత్రహింసలు పెట్టేవాడు. భర్త వేదింపులను తట్టుకోలేకపోయిన సుగుణమ్మ అనే గృహిని శుక్రవారం అతడిపై కత్తితో దాడి చేసింది.

మద్యం మత్తులో వచ్చిన భర్త కళ్లలో కారం కొట్టి విచక్షణ రహితంగా పోడిచింది. చంద్రయ్య అక్కడికక్కడే చనిపోయాడు. భర్తను చంపిన తర్వాత సుగుణమ్మ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. తన భర్త వేధింపులను తట్టుకోలేక హత్య చేశానని చెప్పింది.అయితే చంద్రయ్య చావుకు కారణం మద్యం కాదని ,ఇతర కారణం ఏదో ఉంటుందని ఆయన బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications